జయహో భారత్​.. హ్యాట్రిక్‌‌‌‌‌‌‌‌తో టాప్‌‌‌‌‌‌‌‌ ప్లేస్‌‌‌‌‌‌‌‌లోకి రోహిత్‌‌‌‌‌‌‌‌సేన

జయహో భారత్​.. హ్యాట్రిక్‌‌‌‌‌‌‌‌తో టాప్‌‌‌‌‌‌‌‌ ప్లేస్‌‌‌‌‌‌‌‌లోకి రోహిత్‌‌‌‌‌‌‌‌సేన
  •     పాకిస్తాన్‌‌ను చిత్తు చేసిన టీమిండియా
  •     వన్డే వరల్డ్‌‌ కప్స్‌‌లో ఆ జట్టుపై వరుసగా ఎనిమిదో విజయం సొంతం
  •     వరల్డ్‌‌‌‌‌‌‌‌ కప్స్‌‌‌‌‌‌‌‌లో పాక్‌‌‌‌‌‌‌‌పై ఎనిమిదోసారి గెలుపు
  •     చెలరేగిన రోహిత్‌‌‌‌‌‌‌‌, అయ్యర్‌‌‌‌‌‌‌‌,  బౌలర్లు

చరిత్ర మారలేదు. వన్డే వరల్డ్‌‌‌‌‌‌‌‌కప్‌‌‌‌‌‌‌‌లో పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌పై టీమిండియా రికార్డు చెక్కు చెదరలేదు..!  ప్రపంచంలోనే అతి పెద్ద స్టేడియం వేదికగా క్రికెట్‌‌‌‌‌‌‌‌ హిస్టరీలోనే బిగ్గెస్ట్‌‌‌‌‌‌‌‌ మ్యాచ్‌‌‌‌‌‌‌‌ను ఇండియా వన్‌‌‌‌‌‌‌‌సైడ్‌‌‌‌‌‌‌‌ చేసేసింది.! నవరాత్రుల ముంగిట పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌కు మరో కాళరాత్రిని మిగిలిస్తూ వరల్డ్​ కప్స్​లో దాయాదితో ముఖాముఖీ రికార్డును 8-0కు పెంచుకుంది..!  మూడోసారి కప్పు కొట్టాలన్న  టార్గెట్‌‌‌‌‌‌‌‌తో బరిలోకి దిగిన ఇండియా ఈ జర్నీలో పాక్‌‌‌‌‌‌‌‌ను చిత్తుగా ఓడిస్తూ  హ్యాట్రిక్‌‌‌‌‌‌‌‌ విక్టరీతో టాప్‌‌‌‌‌‌‌‌ ప్లేస్‌‌‌‌‌‌‌‌కు చేరుకుంది..! 

వన్డే వరల్డ్‌‌ కప్‌‌లో హైటెన్షన్‌‌ రేపిన ఇండియా - పాకిస్తాన్‌‌ మ్యాచ్‌‌ వన్‌‌సైడ్‌‌ అయింది. మెగా టోర్నీలో  పాకిస్తాన్‌‌పై  చెక్కు చెదరని రికార్డును టీమిండియా కొనసాగించింది.వరల్డ్‌‌ కప్స్‌‌లో పాకిస్తాన్‌‌తో ఆడిన ఎనిమిదో మ్యాచ్‌‌లోనూ విజయం సాధించింది. అహ్మదాబాద్‌‌లోని  ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్‌‌ స్టేడియంలో శనివారం జరిగిన మ్యాచ్‌‌లో ఇండియా 7 వికెట్ల తేడాతో పాకిస్తాన్‌‌ను చిత్తుగా ఓడించింది. వరల్డ్‌‌ కప్‌‌లో వరుసగా మూడో విజయంతో హ్యాట్రిక్‌‌ సాధించింది. తొలుత ఆతిథ్య జట్టు కట్టుదిట్టమైన బౌలింగ్‌‌ ధాటికి  పాకిస్తాన్‌‌ 42.5 ఓవర్లలో 191 రన్స్‌‌కే ఆలౌటైంది. అనంతరం కెప్టెన్‌‌ రోహిత్‌‌ శర్మ (63 బాల్స్‌‌లో 6 ఫోర్లు, 6 సిక్సర్లతో 86), శ్రేయస్‌‌ అయ్యర్ (62 బాల్స్‌‌లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 53 నాటౌట్‌‌) ఫిఫ్టీతో రాణించడంతో ఇండియా 30.3 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది.

155/2 నుంచి 191/10

హైదరాబాదీ సిరాజ్‌‌‌‌‌‌‌‌, పేస్‌‌‌‌‌‌‌‌ లీడర్‌‌‌‌‌‌‌‌  బుమ్రా  ముందుండి నడిపించగా..  పాక్‌‌‌‌‌‌‌‌ను హోమ్‌‌‌‌‌‌‌‌టీమ్‌‌‌‌‌‌‌‌ తక్కువ స్కోరుకే కట్టడి చేసింది. ఓ దశలో 155/2తో బలంగా నిలిచిన పాక్​ మిడిలార్డర్‌‌‌‌‌‌‌‌ ఫెయిల్యూర్‌‌‌‌‌‌‌‌తో కనీసం రెండొందల స్కోరు కూడా చేయలేకపోయింది.  ఫ్లాట్‌‌‌‌‌‌‌‌ పిచ్‌‌‌‌‌‌‌‌పై  టాస్‌‌‌‌‌‌‌‌ నెగ్గిన రోహిత్‌‌‌‌‌‌‌‌ బౌలింగ్‌‌‌‌‌‌‌‌ ఎంచుకోవడంపై తొలుత విమర్శలు వచ్చినా చివరకు అతని నిర్ణయం సరైనదే అని తేలింది. స్టార్టింగ్‌‌‌‌‌‌‌‌లో పాక్‌‌‌‌‌‌‌‌ ఓపెనర్లు షఫీక్‌‌‌‌‌‌‌‌, ఇమామ్‌‌‌‌‌‌‌‌ తొలి వికెట్‌‌‌‌‌‌‌‌కు 41 రన్స్‌‌‌‌‌‌‌‌ జోడించి మంచి ఆరంభమే ఇచ్చారు. ఫస్ట్ స్పెల్‌‌‌‌‌‌‌‌లో బుమ్రా కట్టుదిట్టమైన బంతులు వేసినా.. సిరాజ్‌‌‌‌‌‌‌‌ను టార్గెట్‌‌‌‌‌‌‌‌ చేసి పాక్‌‌‌‌‌‌‌‌ ఓపెనర్లు బౌండ్రీలు కొట్టారు. కానీ, రోహిత్‌‌‌‌‌‌‌‌ సూచనతో తక్కువ ఎత్తులో క్రాస్‌‌‌‌‌‌‌‌ సీమ్‌‌‌‌‌‌‌‌ బాల్‌‌‌‌‌‌‌‌ వేసి షఫీక్‌‌‌‌‌‌‌‌ను ఎల్బీ చేసిన సిరాజ్‌‌‌‌‌‌‌‌ ఇండియాకు ఫస్ట్‌‌‌‌‌‌‌‌ బ్రేక్‌‌‌‌‌‌‌‌ ఇచ్చాడు. థర్డ్‌‌‌‌‌‌‌‌ సీమర్‌‌‌‌‌‌‌‌గా వచ్చిన పాండ్యా  ఊరించే లెంగ్త్‌‌‌‌‌‌‌‌ బాల్‌‌‌‌‌‌‌‌తో ఇమామ్​ బ్యాట్‌‌‌‌‌‌‌‌ నుంచి ఎడ్జ్‌‌‌‌‌‌‌‌ రాబట్టడంతో పాక్‌‌‌‌‌‌‌‌ రెండో వికెట్‌‌‌‌‌‌‌‌ కోల్పోయింది. ఈ టైమ్‌‌‌‌‌‌‌‌లో కెప్టెన్‌‌‌‌‌‌‌‌ బాబర్‌‌‌‌‌‌‌‌, రిజ్వాన్‌‌‌‌‌‌‌‌ ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌ను ముందుకు తీసుకెళ్లే బాధ్యత తీసుకున్నారు.  28 ఓవర్లకు పాక్‌‌‌‌‌‌‌‌ స్కోరు 150 మార్కు దాటగా  బాబర్‌‌‌‌‌‌‌‌ ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. రిజ్వాన్‌‌‌‌‌‌‌‌ కూడా ఫిఫ్టీకి చేరువగా రాగా పాక్‌‌‌‌‌‌‌‌ మంచి స్కోరే చేసేలా కనిపించింది. కానీ, ఈ టైమ్‌‌‌‌‌‌‌‌లో ఇండియా బౌలర్లు ఒక్కసారిగా రెచ్చిపోయారు. సిరాజ్‌‌‌‌‌‌‌‌ వేసిన షార్ట్‌‌‌‌‌‌‌‌ లెంగ్త్‌‌‌‌‌‌‌‌ బాల్‌‌‌‌‌‌‌‌ను తప్పుగా అంచనా వేసిన బాబర్‌‌‌‌‌‌‌‌ బౌల్డ్‌‌‌‌‌‌‌‌ అవ్వడంతో మూడో వికెట్‌‌‌‌‌‌‌‌కు 85 రన్స్‌‌‌‌‌‌‌‌ పార్ట్‌‌‌‌‌‌‌‌నర్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌ బ్రేక్‌‌‌‌‌‌‌‌ అయింది. అక్కడి నుంచి పాక్‌‌‌‌‌‌‌‌ పతనం మొదలైంది. కాసేపటికే కుల్దీప్‌‌‌‌‌‌‌‌ నాలుగు బాల్స్‌‌‌‌‌‌‌‌ తేడాలో సౌద్‌‌‌‌‌‌‌‌ షకీల్ (6), ఇఫ్తికార్‌‌‌‌‌‌‌‌ అహ్మద్‌‌‌‌‌‌‌‌(4)ను ఔట్‌‌‌‌‌‌‌‌ చేసి డబుల్ స్ట్రోక్‌‌‌‌‌‌‌‌ ఇచ్చాడు. తర్వాతి ఓవర్లోనే బుమ్రా వేసిన స్లో ఆఫ్‌‌‌‌‌‌‌‌ కట్టర్‌‌‌‌‌‌‌‌కు రిజ్వాన్‌‌‌‌‌‌‌‌ వద్ద సమాధానమే లేకుండా పోయింది. తన తర్వాతి ఓవర్లోనే షాదాబ్‌‌‌‌‌‌‌‌ ఖాన్‌‌‌‌‌‌‌‌ (2)ను కూడా బౌల్డ్‌‌‌‌‌‌‌‌ చేసిన బుమ్రా మరో దెబ్బకొట్టాడు. 40వ ఓవర్లో నవాజ్‌‌‌‌‌‌‌‌ (4)ను పాండ్యా వెనక్కుపంపగా.. హసన్‌‌‌‌‌‌‌‌ అలీ (12), రవూఫ్ (2) పని పట్టిన జడేజా పాక్‌‌‌‌‌‌‌‌ ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌ను ముగించాడు.
 
మళ్లీ  రో‘హిట్‌‌‌‌‌‌‌‌’

వరల్డ్‌‌‌‌‌‌‌‌కప్‌‌‌‌‌‌‌‌.. అందులోనూ పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌తో మ్యాచ్‌‌‌‌‌‌‌‌ అనగానే రెచ్చిపోయే హిట్‌‌‌‌‌‌‌‌మ్యాన్‌‌‌‌‌‌‌‌ రోహిత్‌‌‌‌‌‌‌‌ మరోసారి తన బ్యాట్‌‌‌‌‌‌‌‌ పవర్‌‌‌‌‌‌‌‌ చూపెట్టడంతో  చిన్న టార్గెట్‌‌‌‌‌‌‌‌ను చూస్తుండగానే అందుకుంది. ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌ ఫస్ట్‌‌‌‌‌‌‌‌ బాల్‌‌‌‌‌‌‌‌నే రోహిత్‌‌‌‌‌‌‌‌ బౌండ్రీకి తరలించగా..  డెంగీ నుంచి కోలుకున్న శుభ్‌‌‌‌‌‌‌‌మన్‌‌‌‌‌‌‌‌ గిల్‌‌‌‌‌‌‌‌ (16) తన తొలి తొమ్మిది బాల్స్‌‌‌‌‌‌‌‌లో నాలుగు ఫోర్లతో అలరించాడు. కానీ,  మూడో ఓవర్లో షాహీన్‌‌‌‌‌‌‌‌ (2/36) షార్ట్‌‌‌‌‌‌‌‌ వైడ్‌‌‌‌‌‌‌‌ బాల్‌‌‌‌‌‌‌‌ను కట్‌‌‌‌‌‌‌‌ షాట్‌‌‌‌‌‌‌‌ ఆడబోయి బ్యాక్‌‌‌‌‌‌‌‌వర్డ్‌‌‌‌‌‌‌‌ పాయింట్‌‌‌‌‌‌‌‌లో షాదాబ్‌‌‌‌‌‌‌‌కు క్యాచ్‌‌‌‌‌‌‌‌ ఇవ్వడంతో స్టేడియం కాసేపు సైలెంట్ అయ్యింది.  ఫ్యాన్స్‌‌‌‌‌‌‌‌ కేరింతల నడుమ క్రీజులోకి వచ్చిన కోహ్లీ (16) స్ట్రయిక్‌‌‌‌‌‌‌‌ రొటేట్‌‌‌‌‌‌‌‌ చేయగా.. రోహిత్‌‌‌‌‌‌‌‌ తన ట్రేడ్‌‌‌‌‌‌‌‌మార్క్‌‌‌‌‌‌‌‌ షాట్లతో రెచ్చిపోయాడు. పవర్‌‌‌‌‌‌‌‌ప్లేను సద్వినియోగం చేసుకుంటూ సిక్సర్ల వర్షం కురిపించాడు. షాహీన్‌‌‌‌‌‌‌‌ వేసిన ఏడో ఓవర్లో లాంగ్‌‌‌‌‌‌‌‌ లెగ్‌‌‌‌‌‌‌‌ మీదుగా తొలి సిక్స్‌‌‌‌‌‌‌‌ కొట్టిన అతను.. నవాజ్‌‌‌‌‌‌‌‌ ఓవర్లో  క్రీజు ముందుకొచ్చి మరో సిక్స్‌‌‌‌‌‌‌‌ బాదాడు. రవూఫ్‌‌‌‌‌‌‌‌ వేసిన తొమ్మిదో ఓవర్లో రెండు బాల్స్‌‌‌‌‌‌‌‌ను స్టాండ్స్‌‌‌‌‌‌‌‌కు పంపడంతో స్టేడియం హోరెత్తింది.  ఓ రనౌట్‌‌‌‌‌‌‌‌ తప్పించుకున్న కోహ్లీ  పదో ఓవర్లో  హసన్‌‌‌‌‌‌‌‌ అలీకి వికెట్‌‌‌‌‌‌‌‌ ఇచ్చుకోవడంతో రెండో వికెట్‌‌‌‌‌‌‌‌కు 56 రన్స్‌‌‌‌‌‌‌‌ పార్ట్‌‌‌‌‌‌‌‌నర్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌ బ్రేక్‌‌‌‌‌‌‌‌ అయింది. నాలుగో నంబర్‌‌‌‌‌‌‌‌లో వచ్చిన  శ్రేయస్‌‌‌‌‌‌‌‌ అయ్యర్‌‌‌‌‌‌‌‌ తోడుగా అదే జోరు కొనసాగించిన రోహిత్‌‌‌‌‌‌‌‌ 36 బాల్స్‌‌‌‌‌‌‌‌లోనే ఫిఫ్టీ పూర్తి చేసుకోగా, 14 ఓవర్లకే స్కోరు 100 దాటింది. అటు అయ్యర్‌‌‌‌‌‌‌‌ కూడా బ్యాట్‌‌‌‌‌‌‌‌ ఝుళిపిస్తూ  ఫోర్లు, సిక్సర్లు కొట్టడంతో స్కోరు బోర్డు ఉరకలు  పెట్టింది. షాదాబ్‌‌‌‌‌‌‌‌ బౌలింగ్‌‌‌‌‌‌‌‌లో సిక్స్‌‌‌‌‌‌‌‌, నవాజ్‌‌‌‌‌‌‌‌ వేసిన 20వ ఓవర్లో ఫోర్‌‌‌‌‌‌‌‌ రాబట్టిన రోహిత్‌‌‌‌‌‌‌‌ ఇంకో సెంచరీ చేసేలా కనిపించాడు. కానీ, తర్వాతి ఓవర్లోనే షాహీన్‌‌‌‌‌‌‌‌ వేసిన స్లో ఆఫ్‌‌‌‌‌‌‌‌ కట్టర్‌‌‌‌‌‌‌‌కు మిడ్‌‌‌‌‌‌‌‌ వికెట్‌‌‌‌‌‌‌‌లో ఇఫ్తికార్‌‌‌‌‌‌‌‌కు సింపుల్‌‌‌‌‌‌‌‌ క్యాచ్‌‌‌‌‌‌‌‌ ఇచ్చాడు. దాంతో,  మూడో వికెట్‌‌‌‌‌‌‌‌కు 77 రన్స్‌‌‌‌‌‌‌‌ పార్ట్‌‌‌‌‌‌‌‌నర్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌ బ్రేక్‌‌‌‌‌‌‌‌ అయింది. అప్పటికి ఇండియాకు మరో 34 రన్స్‌‌‌‌‌‌‌‌ అవసరం కాగా.. కేఎల్‌‌‌‌‌‌‌‌ రాహుల్‌‌‌‌‌‌‌‌(19 నాటౌట్‌‌‌‌‌‌‌‌) తో కలిసి అయ్యర్‌‌‌‌‌‌‌‌ గెలుపు లాంఛనం పూర్తి చేశాడు.

సంక్షిప్త స్కోర్లు

పాకిస్తాన్: 42.5 ఓవర్లలో 191 ఆలౌట్‌‌‌‌‌‌‌‌ (బాబర్‌‌‌‌‌‌‌‌ 50, రిజ్వాన్‌‌‌‌‌‌‌‌ 49, బుమ్రా 2/19)
ఇండియా: 30.3 ఓవర్లలో 192/3 (రోహిత్‌‌‌‌‌‌‌‌ 86, శ్రేయస్ 53 నాటౌట్‌‌‌‌‌‌‌‌, షాహీన్‌‌‌‌‌‌‌‌ 2/36)

వన్డేల్లో రోహిత్‌‌‌‌‌‌‌‌ కొట్టిన సిక్సర్లు 303. ఈ ఫార్మాట్​లో ఎక్కువ సిక్సర్లు కొట్టిన ప్లేయర్లలో ఆఫ్రిది (351), క్రిస్‌‌‌‌‌‌‌‌ గేల్‌‌‌‌‌‌‌‌ (331) తర్వాత టాప్​3లో నిలిచాడు.

వరల్డ్‌‌‌‌‌‌‌‌కప్‌‌‌‌‌‌‌‌లో ఇండియాపై పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌కు ఇది సెకండ్‌‌‌‌‌‌‌‌ లోయెస్ట్‌‌‌‌‌‌‌‌ స్కోరు. 1999 టోర్నీలో 180 రన్స్‌‌‌‌‌‌‌‌కు ఆలౌటైంది.

అహ్మదాబాద్‌‌‌‌ ‘బ్లూ’ మయం

ఊహించినట్లుగానే ఇండో–పాక్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌ వరల్డ్‌‌‌‌ క్రికెట్‌‌‌‌ను ఊపేసింది. మ్యాచ్‌‌‌‌కు వేదికైన మొతెరాతో పాటు అహ్మదాబాద్‌‌‌‌ మొత్తం ‘బ్లూ’ కలర్​లోకి మారిపోయింది. లక్షా 30 వేల మంది ఫ్యాన్స్​ మ్యాచ్​కు హాజరయ్యారు. వీరిలో మెజారిటీ వంతూ ఇండియా బ్లూ జెర్సీలు ధరించి నరేంద్ర మోదీ స్టేడియానికి కొత్త కళ తెచ్చారు. ఉదయం 11 నుంచే సిటీ జనాలు మొతెరా వైపు పరుగులు పెట్టారు. బ్యాంకాక్‌‌‌‌, బెంగళూరు, సింగపూర్‌‌‌‌, సూరత్‌‌‌‌, డెట్రాయిట్‌‌‌‌, ఢిల్లీ నుంచి శుక్రవారం రాత్రే అహ్మదాబాద్‌‌‌‌ చేరుకున్న ఫ్యాన్స్‌‌‌‌తో స్టేడియం నిండిపోయింది. ఓపెనింగ్‌‌‌‌ సెర్మనీ లైవ్‌‌‌‌ లేకపోయినా స్టేడియంలో ఉన్న ఫ్యాన్స్‌‌‌‌.. శంకర్‌‌‌‌ మహదేవన్‌‌‌‌, సునిధి చౌహాన్‌‌‌‌, అరిజిత్‌‌‌‌ సింగ్‌‌‌‌తో కోరస్‌‌‌‌ పాడారు. ‘భారత్‌‌‌‌ మాతాకీ జై’, ‘వందేమాతరం’ అభిమానులు నినదించారు. మహదేవన్‌‌‌‌ ఆలపించిన ‘సునో ఘర్‌‌‌‌ సే దునియవాలన్‌‌‌‌’ పాటకు అభిమానులు ఆడి పాడారు. ఇక టాస్‌‌‌‌కు ముందు వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌ ట్రోఫీని సచిన్‌‌‌‌ స్టేడియంలోకి తీసుకొచ్చాడు. సెంట్రల్‌‌‌‌ హోం మినిస్టర్‌‌‌‌ అమిత్‌‌‌‌ షా దంపతులు, బీసీసీఐ సెక్రటరీ జై షాతో పాటు పలువురు ప్రముఖులు ఈ మ్యాచ్‌‌‌‌కు హాజరయ్యారు.