హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ కంపెనీ ఐస్ మేక్ రెఫ్రిజిరేషన్ లిమిటెడ్ 2025–26 ఆర్థిక సంవత్సరం నాలుగో క్వార్టర్ (క్యూ4), పూర్తి సంవత్సరానికి గానూ రికార్డు స్థాయి ఆదాయాన్ని నమోదు చేసింది. కంపెనీ ఆదాయం క్యూ4లో ఏడాది లెక్కన 41.8శాతం పెరిగి రూ. 255.85 కోట్లకు చేరుకుంది. గతేడాది మార్చి క్వార్టర్‌లో ఇది రూ. 180.35 కోట్లుగా ఉంది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి కన్సాలిడేటెడ్ ఆదాయం 39.3శాతం పెరిగి రూ. 668.20 కోట్లకు చేరింది. కంపెనీ నికర లాభం 2025–26 లో రూ. 12.13 కోట్లుగా నమోదైంది.
