ఐసీఐసీఐ బ్యాంక్ ప్రాఫిట్ రూ.12,359 కోట్లు

ఐసీఐసీఐ బ్యాంక్ ప్రాఫిట్ రూ.12,359 కోట్లు

న్యూఢిల్లీ: ఐసీఐసీఐ బ్యాంక్  నికర లాభం  (స్టాండ్‌‌‌‌ఎలోన్‌‌‌‌) ఈ ఏడాది సెప్టెంబర్ క్వార్టర్‌‌‌‌‌‌‌‌లో  రూ.12,359 కోట్లకు  పెరిగింది. ఇది గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 5.2శాతం ఎక్కువ.  మార్కెట్ అంచనాలైన రూ.12,024 కోట్లను బ్యాంక్ అధిగమించింది.  

నికర వడ్డీ ఆదాయం (ఎన్‌‌‌‌ఐఐ) 7.4 శాతం పెరిగి రూ.21,529.5 కోట్లకు చేరింది. మొత్తం ఆదాయం రూ.49,333.5 కోట్లుగా నమోదైంది. బ్యాంక్ అసెట్ క్వాలిటీ క్యూ2లో  మెరుగైంది. గ్రాస్‌‌‌‌ ఎన్‌‌‌‌పీఏ రూ.23,849.7 కోట్లకు తగ్గగా, అడ్వాన్స్‌‌‌‌లలో వీటి రేషియో 1.58శాతంగా ఉంది. 

నెట్ ఎన్‌‌‌‌పీఏలు రూ.5,827 కోట్లుగా ఉన్నాయి. రేషియో 0.39శాతానికి మెరుగయ్యింది. బ్యాంక్  ప్రొవిజన్లు క్యూ2లో ఏడాది లెక్కన 26శాతం తగ్గి రూ.914 కోట్లకు చేరాయి. క్యాపిటల్ అడిక్వసీ రేషియో 15.76శాతంకి మెరుగైంది.