ఐసీఐసీఐ లాంబార్డ్‌‌ చేతికి భారతీ ఆక్సా జనరల్‌ ఇన్సూరెన్స్

ఐసీఐసీఐ లాంబార్డ్‌‌ చేతికి భారతీ ఆక్సా జనరల్‌ ఇన్సూరెన్స్

న్యూఢిల్లీ: భారతీ ఆక్సా జనరల్‌‌ ఇన్సూరె న్స్‌‌ బిజినెస్‌ను కొనుగోలు చేసేందుకు బోర్డ్‌‌ ఆమోదం తెలిపిందని ఐసీఐసీఐ లాంబార్డ్‌‌ ప్రకటించింది. షేర్‌‌‌‌స్వాప్‌‌ డీల్ ‌‌ద్వారా ఈ కొనుగోలు జరగనుంది. ఈ డీల్‌‌లో భాగంగా భారతీ ఆక్సా జనరల్‌‌ ఇన్సూరెన్స్‌‌  షేర్ ‌‌‌‌హోల్డర్లకు  ప్రతీ 115 షేర్లకు రెండు ఐసీఐసీఐ లాంబార్డ్ ‌‌షేర్లు దక్కుతాయి.

ప్రస్తుతం భారతీ ఆక్సాజనరల్ ‌‌ఇన్సూరెన్స్‌‌లో భారతీ ఎంటర్‌‌‌‌ప్రైజెస్‌కు 51 శాతం వాటా ఉంది. మిగిలిన 49 శాతం వాటా ఫ్రెంచ్‌ ఇన్సూరెన్స్‌‌ కంపెనీ ఆక్సా చేతిలో ఉంది. ఈ డీల్‌‌విలువను కంపెనీలు బయట పెట్టలేదు. కానీ భారతీ ఎంటర్‌‌‌‌ప్రైజెస్‌, ఆక్సా కంపెనీలు షేర్‌‌‌‌ స్వాప్ ‌‌ద్వారా 3.51 కోట్ల ఐసీఐసీఐ లాంబార్డ్‌‌షేర్లు పొందుతారు. వీటి విలువ సుమారుగా రూ. 4,605 కోట్లుగా ఉండొచ్చని అంచనా. ఈ మెర్జర్‌‌ పూర్తయ్యాక జనరల్ ‌‌ఇన్సూరెన్స్ ‌‌మార్కె ట్‌‌లో ఐసీఐసీఐ లాంబార్డ్ ‌‌8.7 శాతం వాటా దక్కుతుందని, యాన్యువల్ ‌‌ప్రీమియం రూ. 16,447 కోట్లకు చేరుకుంటుందని ఐసీఐసీఐ లంబార్డ్‌‌ పేర్కొంది. జనరల్ ‌‌ఇన్సూరె న్స్ ‌‌మార్కెట్లో మూడో అతిపెద్ద కంపెనీగా ఎదుగుతుందని తెలిపింది. ఐసీఐసీఐ లంబార్డ్ లో‌‌ ఐసీఐసీఐ బ్యాంక్‌‌ కు 51.89 శాతం వాటా ఉండగా, మిగిలిన వాటా పబ్లిక్ చేతిలో ఉంది. ప్రస్తుతం ఈ డీల్‌‌ పూ ర్తయితే ఐసీఐసీఐ లంబార్డ్ లో ‌ ఐసీఐసీఐ బ్యాంక్ వాట 48.11 శాతానికి తగ్గుతుంది.