
హైదరాబాద్, వెలుగు: ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ ఐసీఐసీఐ ప్రూ గిఫ్ట్ ప్రో పేరుతో ఇన్కమ్ ప్లాన్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇది ఏటా స్థిరమైన ఆదాయాన్ని ఇస్తుంది. ఈ నాన్- పార్టిసిపేటింగ్ సేవింగ్స్ ప్రొడక్ట్ లైఫ్ కవర్‌తోపాటు కుటుంబానికి ఆర్థిక భద్రతను సైతం అందిస్తుంది.
హామీపూరిత దీర్ఘకాలిక ఆదాయంతో పాటు, ఏకమొత్తం ప్రయోజనాన్ని పొందే అవకాశం ఉంటుంది. ఇల్లు కొనడం, రిటైర్‌మెంట్ కార్పస్‌ను నిర్మించడం వంటి లక్ష్యాల కోసం ఈ ప్లాన్‌ను ఎంచుకోవచ్చు. పాలసీ వ్యవధిలో పాలసీదారు మరణిస్తే నామినీకి రాబడి వస్తూనే ఉంటుంది. ప్రీమియంను 5 నుంచి 12 సంవత్సరాల వరకు చెల్లించాలి.