హైదరాబాద్, వెలుగు: తెలంగాణలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి క్వార్టర్లో 60.7 శాతం వృద్ధి సాధించామని ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రకటించింది. టర్మ్ ప్లాన్ వ్యాపారం భారీగా పెరిగిందని, రాష్ట్రంలో ఈ ఏడాది మార్చి నాటికి కంపెనీ ఏయూఎం విలువ రూ.11,708 కోట్లకు చేరిందని తెలిపింది.
బీమా హామీ మొత్తం రూ.1,52,016 కోట్లు ఉంది. గత ఏడేళ్లలో కంపెనీ తెలంగాణలో వినియోగదారులకు రూ.4,060 కోట్ల ప్రయోజనాలను అందించింది. ఏఐ, డేటా అనలిటిక్స్, డిజిటల్ కేవైసీ టెక్నాలజీలను ఉపయోగించి కస్టమర్ అనుభవాన్ని మెరుగుపరుస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది.
మొదటి క్వార్టర్లో క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో 99.3 శాతంగా నమోదయిందని చీఫ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫీసర్ అమీష్ బంకర్ తెలిపారు. రాష్ట్రంలో తమకు 11 బ్రాంచ్‌లు, 3,934 పార్ట్‌నర్ బ్రాంచ్‌లు ఉన్నాయని, వీటి సంఖ్యను పెంచుతామని వివరించారు.
