గంగా జ‌లంతో క‌రోనా ట్రీట్మెంట్: భార‌త మెడిక‌ల్ రీసెర్చ్ కౌన్సిల్ కు ప్ర‌తిపాద‌న‌

గంగా జ‌లంతో క‌రోనా ట్రీట్మెంట్: భార‌త మెడిక‌ల్ రీసెర్చ్ కౌన్సిల్ కు ప్ర‌తిపాద‌న‌

హిమాల‌యాల్లో పుట్టిన‌ ప‌విత్ర గంగా న‌దీ జ‌లంతో క‌రోనాకు ట్రీట్మెంట్ గా వాడ‌డంపై క్రిక‌ల్ ట్ర‌య‌ల్స్ నిర్వ‌హించాల‌ని కోరుతూ భార‌త మెడిక‌ల్ రీసెర్చ్ కౌన్సిల్ (ఐసీఎంఆర్)కు ప్ర‌తిపాద‌న అందింది. ప‌విత్ర గంగా జ‌లంతో క‌రోనా న‌యం చేసే అవ‌క‌శాల‌పై క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్ నిర్వ‌హించాల‌ని కోరుతూ రిట‌ర్డ్ ఆర్మీ మేజ‌ర్ ఆధ్వ‌ర్యంలో న‌డుస్తున్న అతుల్య గంగ సంస్థ.. కేంద్ర జ‌ల శ‌క్తి మంత్రిత్వ శాఖకు లేఖ రాసింది. దీంతో ఆ శాఖ ప‌రిధిలో న‌డిచే నేష‌న‌ల్ మిష‌న్ ఫ‌ర్ క్లీన్ గంగా (ఎన్ఎంసీజీ).. ఐసీఎంఆర్ కు పేషెంట్ల‌కు గంగా జ‌లం ఇవ్వ‌డం ద్వారా వేగంగా కోలుకుంటారేమో ప‌రిశీలించాల‌ని కోరుతూ ప్ర‌తిపాద‌నను ఫార్మాడ్ చేసింది.

గంగా జ‌లంలో బ్యాక్టీరియాల‌ను చంపే శ‌క్తి

గంగా న‌దీ ప్ర‌వాహం మొద‌లయ్యే తొలి ప్ర‌దేశాల్లోని జ‌లాల్లో బ్యాక్టీరియాల‌ను చంపేసే బ్యాక్టీరియోఫేజెస్ ఉన్నాయ‌ని, వీటిని నింజా వైర‌స్ అని అంటార‌ని అతుల్య గంగ సంస్థ లేఖ‌లో తెలిపిన‌ట్లు ఎన్ఎంసీజీ అధికారి చెప్పారు. వీటినే గంగ‌త్వ ఫేజెస్ అని కూడా అంటార‌ని, గంగా జ‌లం తాగితే శ‌రీరంలో మ‌నిషికి హాని చేసే బ్యాక్టీరియాల‌ను టార్గెటెడ్ గా ఇవి చంపేస్తాయ‌ని సైంటిఫిక్ గా రుజువైంద‌ని తెలిపారు. భార‌త్ లో ప‌విత్రమైన‌ గంగా న‌ది ప్ర‌వ‌హిస్తుండ‌డం ఓ అదృష్ట‌మ‌ని అన్నారు అతుల్య గంగ వ్య‌వ‌స్థాప‌కుడు రిటైర్డ్ మేజ‌ర్ మ‌నోజ్ కేశ్వార్. గంగా జ‌లంలో బ్యాక్టీరియోఫేజెస్ ఉన్నాయ‌ని శాస్త్రీయంగా రుజువైంద‌ని, దీని ఆధారంగా క‌రోనా పేషెంట్ల‌కు చికిత్స‌కు ఉప‌యోగ‌ప‌డుతుందేమోన‌ని ప‌రిశీలించాల‌ని తాను కోరాన‌ని చెప్పారు. త‌న ప్ర‌తిపాద‌న‌కు కేంద్రం సానుకూలంగా స్పందించ‌డం సంతోషంగా ఉంద‌న్నారు.