
న్యూఢిల్లీ: పెండింగ్ లో ఉన్న ఐసీఎస్ఈ క్లాస్ టెన్త్, ఐసీఈ ట్వల్త్ పరీక్షల తేదీలను కౌన్సిల్ ఫర్ ది ఇండియన్ స్కూల్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్స్ (సీఐఎస్సీఈ) శుక్రవారం ప్రకటించింది. ‘‘ ట్వల్త్ స్టూడెంట్లకు జులై 2 నుంచి 12 వరకు పరీక్షలు జరుగుతాయి. టెన్త్ స్టూడెంట్లకు జులై 1 నుంచి 14 వరకు పరీక్షలు జరుపుతాం. శానిటైజర్ బాటిల్స్, మాస్కుల్ని స్టూడెంట్స్ తప్పకుండా తమతోపాటు తెచ్చుకోవాలి” అని సీఐఎస్సీఈ చీఫ్ ఎగ్జిక్యూటివ్ గెర్రీ అరాథాన్ అన్నారు. ఎగ్జామ్ హాల్స్ లో ఫిజికల్ డిస్టెన్స్ మెయింటేన్ చేయాలని, లాక్డౌన్ రూల్స్ తప్పనిసరిగా పాటించాలని స్కూళ్లను ఆదేశించారు.
For More News..