V6 News

ఇవ్వాల గుడిలోకి ఆనాటి రామ్ లల్లా

ఇవ్వాల గుడిలోకి ఆనాటి రామ్ లల్లా
  • లక్ష్మణ, భరత, శత్రుఘ్నుల విగ్రహాలు కూడా..

న్యూఢిల్లీ, వెలుగు: ఇనుప కంచెల మధ్య చిన్న గుడారంలో పూజలుందుకుంటున్న రామ్ లల్లా విగ్రహం ఆదివారం భవ్య రామ మందిరానికి చేరుకోనుంది. రాముడితో పాటు లక్ష్మణ, భరత, శత్రుఘ్నుల విగ్రహాలను అయోధ్యలోని నూతన మందిరానికి తరలించి, సోమవారం జరిగే శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ తంతులో భాగం చేయనున్నారు. ఇకపై ఈ విగ్రహాలు కూడా భక్తులకు దర్శనం ఇవ్వనున్నాయి.

1949 డిసెంబర్ నుంచి..

1949 డిసెంబర్ 22, 23 తేదీల్లో రాత్రి సమయంలో రామ జన్మభూమి (బాబ్రీ మసీదు) లోపల బాబా అవిరాందాస్ జీ మహరాజ్ ఈ నాలుగు విగ్రహాలు ప్రతిష్ఠించినట్లు ఆలయ ప్రధాన పూజారులు చెబుతున్నారు. ఆ మరుసటి రోజు నుంచి ఆలయంలో పూజలు చేయడం మొదలైంది. తర్వాత పలు మైనార్టీ సంఘాలు కోర్టును ఆశ్రయించడంతో కొన్ని రోజులు ఆ తాత్కాలిక ఆలయానికి తాళం పడింది. 

తర్వాత కోర్టు ఉత్తర్వులతో ఆలయం మళ్లీ తెరుచుకొని పూజలు కొనసాగాయి. 1992లో బాబ్రీ మసీదు ఘటన తర్వాత రామ్ లల్లాను టెంట్‌‌లోకి తరలించారు. గుడారంలోనే ఏండ్లుగా భక్తులకు రామ్ లల్లా దర్శనం కలుగుతున్నది. 32 ఏండ్ల తర్వాత 2019లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో రామ జన్మభూమిలో మందిర నిర్మాణానికి బీజంపడింది. దీంతో 2020 లో ఈ నాలుగు విగ్రహాలను యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ స్వయంగా ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా కర్రలతో తయారు చేసిన తాత్కాలిక మందిరానికి తరలించారు.

32 ఏండ్లుగా స్వామి సన్నిధిలోనే: ఆలయ ముఖ్య పూజారి సంతోష్ తివారీ

రామ్ లల్లా ఆలయానికి ప్రధాన అర్చకులుగా ఆచార్య సత్యేంద్ర దాస్ ఉండేవారని, ఆయన తర్వాతి నుంచి రామ్ లల్లాకు తాను సేవలందిస్తున్నానని ఆలయ ముఖ్య పూజారి సంతోష్ తివారీ తెలిపారు. ‘‘1992 మార్చి 1వ తేదీ నుంచి దాదాపు 32 ఏండ్లుగా రామ్ లల్లాకు పూజలు చేస్తున్నాను. ఏదో ఒక రోజు భవ్య రామ మందిర నిర్మాణం పూర్తవుతుందని నమ్మే వాడిని. ఆ కల నెరవేరింది.