
- గుడి సమీపంలో విసిరివేత
- క్షుద్రపూజలు జరిగినట్లు గ్రామస్తుల అనుమానం
లక్ష్మణచాంద, వెలుగు: నిర్మల్ జిల్లా లక్ష్మణచాంద మండలం కంజర్ గ్రామంలోని మహాలక్ష్మి, ముత్యాలమ్మ ఆలయాల్లో మంగళవారం అర్ధరాత్రి విగ్రహాలను కొందరు అపహరించుకొని పోయారు. కాగా వాటిని ఆలయ సమీపంలోనే పడేశారు. చోరీ ఘటన బుధవారం ఉదయం వెలుగులోకి వచ్చింది. గ్రామస్తులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై శ్రీనివాస్ ఘటనా స్థలానికి చేరుకొని క్లూస్ టీమ్‌తో దర్యాప్తు చేపట్టారు. చోరీ చేసిన విగ్రహాలు ఆలయ సమీపంలో పడేయగా వాటిని తీసుకొచ్చి భద్రపరిచారు. కాగా గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. ఆలయాల్లో క్షుద్రపూజలు జరిగినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.