బీజేపీ గెలిస్తే యోగీ పని అంతమౌతుంది : అరవింద్ కేజ్రీవాల్

బీజేపీ గెలిస్తే యోగీ పని అంతమౌతుంది : అరవింద్ కేజ్రీవాల్

బీజేపీ పార్టీ పై విమర్శలు చేశారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. బీజేపీ ప్రతిపక్ష పార్టీల నేతలనే కాకుండా సొంత పార్టీ నేతలను కూడా బీజేపీ జైల్లో పెడుతుందని విమర్శించారు. బీజేపీ గెలిస్తే ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ రాజకీయ జీవితం రెండు నెలల్లో అంతమవుతుందని అన్నారు. బీజేపీలో అధికారాన్ని స్వాధీనం చేసుకోవడం వెనుక ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా కీలకంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. 

మోదీ ‘ఒకే దేశం, ఒకే నాయకుడు’ ప్లాన్‌ను ప్రారంభించారని, త్వరలో ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ రాజకీయ జీవితాన్ని కూడా ముగించబోతున్నారని చెప్పారు. అద్వానీ, మురళీ జోషి, శివరాజ్ చౌహాన్, వసుంధరా రాజే, ఖట్టర్, రమణ్ సింగ్‌ల రాజకీయాలు ముగిశాయని యోగి ఆదిత్యనాథ్ తర్వాతి స్థానంలో ఉన్నారని చెప్పారు. 

అందుకే అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులను మారుస్తున్నారని ఆరోపించారు. ఎప్పుడైతే ఒక నియంత దేశాన్ని ఆధీనంలోకి తీసుకోవాలని ప్రయత్నించారో అప్పుడు ప్రజలు వారిని నిర్మూలించారని అరవింద్ కేజ్రీవాల్ అన్నారు.