చైనా అభివృద్ధి చెందుతున్న దేశమైతే అమెరికా కూడా అంతే

చైనా అభివృద్ధి చెందుతున్న దేశమైతే అమెరికా కూడా అంతే
  • అభివృద్ధి చెందుతున్న దేశం పేరుతో దోపిడీ
  •  డ్రాగన్ కంట్రీకి దక్కుతున్న ప్రయోజనాలపై ట్రంప్ ఫైర్

వాషింగ్టన్ : చైనా అభివృద్ధి చెందుతున్న దేశమైతే మమ్మల్ని కూడా అభివృద్ధి చెందుతున్న దేశంగానే పరిగణించాలని ట్రంప్ కోరారు. అభివృద్ధి చెందుతున్న దేశం పేరిట అమెరికాను చైనా కొల్లగొట్టిందంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమెరికాను కరోనా ఆగం చేస్తుండటంతో చైనాపై ట్రంప్ అసహనంతో ఉన్నారు. శుక్రవారం వైట్ హౌజ్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా చైనాను టార్గెట్ చేస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధి చెందుతున్న దేశం హోదాను దాటేసినప్పటికీ ఇప్పటికీ చైనా ఆ ప్రయోజనాలను పొందుతుందని ట్రంప్ విమర్శించారు. చైనా అభివృద్ధి చెందుతున్న దేశమైతే అమెరికా కూడా అభివృద్ధి చెందుతున్న దేశమే…అమెరికాలో డెవలప్ చేయాల్సి అంశాలు చాలా ఉన్నాయని ఆయన అన్నారు. అమెరికా సపోర్ట్ తోనే వరల్ట్ ట్రేడ్ సెంటర్ (డబ్ల్యూటీఓ) లో చైనా చేరిందని ఆ తర్వాత గణనీయంగా అభివృద్ధి సాధించిందని అన్నారు. 30 ఏళ్లుగా ప్రయోజనాలు పొందుతున్న చైనా దోపిడికి పాల్పడుందని విమర్శించారు. ” ఈ విషయంలో తప్పంతా అమెరికాను పాలించిన గత పాలకులదే. చైనాను తప్పబట్టానికి ఏమీ లేదు. ఇంతా జరుగుతున్న చూస్తు ఊరుకున్నారు. నా పాలనలో ఇలా జరగటాన్ని అనుమతించను” అని ట్రంప్ చెప్పారు. అధికారంలో వచ్చాక చైనా ఉత్పత్తులపై విధించిన పన్నులతో వేలా కోట్ల ఆదాయం దేశానికి వచ్చిందన్నారు.
వీసా నిబంధనలు కఠినం చేస్తాం
కరోనా కారణంగా విదేశాల్లో చిక్కుకుపోయిన అమెరికన్లను స్వదేశానికి రానివ్వని దేశాలపై వీసా నిబంధనలు కఠినతరం చేస్తామని ట్రంప్ హెచ్చరించారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా విజృంభించటంతో చాలా దేశాలు లాక్ డౌన్ ప్రకటించాయి. దాదాపు అన్ని దేశాలు ఇంటర్నేషనల్ ఫ్లైట్ లను బంద్ పెట్టాయి. దీంతో పలు దేశాల్లో ఉంటున్న అమెరికన్లు అక్కడే ఉండాల్సి పరిస్థితి ఏర్పడింది. తమ వారిని తిరిగి పంపించాలని అమెరికా అన్ని దేశాలను కోరుతోంది. కరోనా ఎఫెక్ట్ నేపథ్యంలో చాలా దేశాలు ఎక్కడి వారిని అక్కడే ఉంచాలని భావిస్తుండటంతో అమెరికా పౌరులు తిరిగి వెళ్లటం కష్టంగా మారింది. దీంతో ట్రంప్ మళ్లీ బెదిరింపు అస్త్రం ప్రయోగించారు. తమ పౌరులను రానివ్వని దేశాలపై వీసా నిబంధనలు కఠినంగా అమలు చేస్తామని హెచ్చరించారు. ‘వీసా జారీని నిలిపివేయడం..కావాలని ఆలస్యం చేస్తున్న దేశాలపై వీసా నిబంధనల విషయమై కఠినంగా ఉంటాం” అని ట్రంప్‌ తెలిపారు. హోంల్యాండ్‌ సెక్యురిటీ అధికారులతో జరిగిన సమావేశంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.