భారత్ వరల్డ్ కప్ గెలిస్తే రూ. 100 కోట్లు పంచుతాం

భారత్ వరల్డ్ కప్ గెలిస్తే రూ. 100 కోట్లు పంచుతాం

న్యూఢిల్లీ:  భారత్, ఆస్ట్రేలియా మధ్య అహ్మదాబాద్ లో జరగనున్న క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ కు ముందు ఓ కంపెనీ తన కస్టమర్లకు బంపరాఫర్ ప్రకటించింది. ఇండియా వరల్డ్ కప్  గెలిస్తే రూ.100 కోట్లను పంచుతామని ఆస్ట్రాలజీ  కంపెనీ ఆస్ట్రోటాక్ అధినేత, సీఈవో పునీత్ గుప్తా ప్రకటించారు. ‘‘ఇండియాలో క్రికెట్ చాలా ఫేమస్. ఈ స్పోర్ట్ దేశం మొత్తాన్ని ఏకతాటిపై నడిపిస్తుంది. 

మ్యాచ్ కోసం అందరూ ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. ఆస్ట్రోటాక్ యూజర్స్ కు ఆ ఉత్సాహన్ని రెట్టింపు చేయాలనుకున్నాం. కంపెనీ లాభాలను మా కస్టమర్స్ అందరికి పంచాలని నిర్ణయించుకున్నాం. భారత్ మ్యాచ్ ను బాగా ఆడి దేశానికి కప్ ను అందిస్తుందని ఆశిస్తున్నాం’’ అని ఆయన తెలిపారు. కాగా, ఆస్ట్రోటాక్ కంపెనీకి దాదాపుగా 3 కోట్లకు పైగా యూజర్స్ ఉన్నారు. ఒకవేళ ఇండియా గనక మ్యాచ్ గెలిస్తే సీఈవో ఆఫర్ మేరకు వీరందరికీ రూ.100 కోట్లను పంపిణీ చేయాల్సి ఉంటుంది.