చట్టవిరుద్ధమైతే రద్దు చేస్తాం: TRS లో CLP విలీనం పిటిషన్ పై హైకోర్టు

చట్టవిరుద్ధమైతే రద్దు చేస్తాం: TRS లో CLP విలీనం పిటిషన్ పై హైకోర్టు

సీఎల్పీని టీఆర్‌‌ఎస్‌‌లో విలీనం చేసే ప్రయత్నాల్నిఅడ్డుకోవాలన్న పిటిషన్‌‌ను అత్యవసరంగా విచారించాల్సి న అవసరం లేదని హైకోర్టు తెలిపింది. విలీనంచట్ట విరుద్ధమైతే దాన్ని రద్దు చేసే అధికారం కోర్టుకుఉంటుందని స్పష్టం చేసింది. సీఎల్పీని టీఆర్‌‌ఎస్‌‌ఎల్పీలో విలీనం చేసేందుకు కుట్ర జరుగుతోందని, దాన్నిఅడ్డుకోవాలంటూ టీపీసీసీ చీఫ్‌‌ ఉత్తమ్‌ కుమార్‌‌రెడ్డి,సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క కోర్టులో పిటిషన్‌‌ దాఖలు చేశారు. అయితే దీన్ని ఇప్పటికిప్పుడే అత్యవసరంగా విచారించాల్సిన అవసరం లేదని హైకోర్టుతాత్కాలిక ప్రధాన న్యా యమూర్తి జస్టిస్‌‌ ఆర్‌‌ఎస్‌‌ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్‌‌ ఎ.రాజశేఖర్‌‌రెడ్డిలతోకూడిన ధర్మాసనం మంగళవారం పేర్కొంది. విలీనం రాజ్యాంగ విరుద్ధమైతే తప్పకుండా కోర్టు స్పందిస్తుందని తెలిపింది. తొలుత పిటిషనర్‌‌ తరఫు లాయర్‌‌ వాదిస్తూ.. ఇప్పటికే కౌన్సిల్‌‌లో కాంగ్రెస్‌‌ పక్షాన్ని టీఆర్‌‌ఎస్‌‌లో విలీనమైనట్లుగా మండలి చైర్మన్‌‌ ప్రకటించారని, ఇప్పుడు హైకోర్టు ఆదేశాలు జారీ చేయకపోతే అసెంబ్లీలో నూ అదే జరుగుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. పార్టీలు విలీనం అయినట్లుగా ప్రకటించే అధికారం కేంద్ర ఎన్నికల సంఘానికే ఉంటుందని,రాజ్యాంగంలో ని 10 షెడ్యూల్‌‌ కింద ట్రిబ్యునల్‌‌గా వ్యవహరించే స్పీకర్‌‌కు ఆ అధికారం లేదన్నారు. అదనపు అడ్వొకేట్‌‌ జనరల్‌‌ జె.రామచందర్‌‌ రావు వాదిస్తూ.. కాంగ్రెస్‌‌ ఎమ్మెల్యేల సభ్యత్వమేమీ రద్దు కావడం లేదని, ఒకవేళ జరిగితే అసెంబ్లీలో వారి సీట్లు మారవచ్చునని పేర్కొన్నారు. రెండు వైపుల వాదనలు విన్నకోర్టు.. తదుపరి విచారణ జూన్‌‌ 11కి వాయిదా వేసింది.