
ఖమ్మం జిల్లా: రైతులు వడ్లు కొనమని అడుగుతుంటే.. పట్టించుకోకుండా ఢిల్లీ వెళ్లి ధర్నా డ్రామాలు ఆడుతున్నారని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. వడ్ల విషయంలో రైతులతో చర్చించకుండా అగ్రిమెంట్ పై సీఎం కేసీఆర్ ఎలా సంతకం చేస్తారని ఆమె ప్రశ్నించారు. రైతుల నుంచి వడ్లను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలంటూ ఖమ్మం జిల్లా ముత గూడెంలో ధర్నాకు దిగారు.
రైతులు బీజేపీకి వ్యతిరేకంగా రైతులు ధర్నా చేయకపోతే రైతుబంధు కట్ చేస్తామన్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుపై షర్మిల మండిపడ్డారు. కేసీఆర్ సంతకం పెడితే.. రైతులు ఎందుకు ఆందోళనలు చేయాలని ఆమె ప్రశ్నించారు. వడ్లు కొనమంటే ఢిల్లీకి వెళ్లి ధర్నాలంటూ డ్రామాలు ఆడుతున్న కేసీఆర్ రైతులపై అప్పుల భారం మోపారని షర్మిల ఆరోపించారు.
ఇవి కూడా చదవండి
ఏపీ పునర్విభజనపై సుప్రీంకోర్టులో ఉండవల్లి పిటిషన్
కమీషన్ల కోసమే బాయిల్డ్ రైస్ పంచాయతీ