ఏటీఎం ట్రాన్సాక్షన్‌ ఫెయిలైతే ఛార్జ్ తప్పదు

ఏటీఎం ట్రాన్సాక్షన్‌ ఫెయిలైతే ఛార్జ్ తప్పదు

బిజినెస్‌‌‌‌డెస్క్‌‌‌‌, వెలుగు: సరిపడినంత బ్యాలెన్స్ లేకపోయినా ఏటీఎంలలో డబ్బులు తీయడానికి ట్రై చేశారా? ఎటువంటి ఛార్జ్‌‌‌‌లు పడవని అనుకుంటే పప్పులో కాలేసినట్టే. అకౌంట్‌‌‌‌లో సరిపడినంత డబ్బులు లేకుండా ఉండి, ఏటీఎం వద్ద ట్రాన్సాక్షన్స్ ఫెయిల్ అయితే బ్యాంకులు అదనపు ఛార్జ్‌‌‌‌లను వసూలు చేస్తాయి. కొన్ని ట్రాన్సాక్షన్ల వరకు ఎటువంటి ఛార్జీలు పడవు. కానీ ఫ్రీ ట్రాన్సాక్షన్ల లిమిట్‌‌‌‌ దాటితే రూ. 20–25 వరకు ఛార్జ్ పడే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు కస్టమర్‌‌‌‌‌‌‌‌ అకౌంట్‌‌‌‌లో రూ. 3 వేలు ఉంటే విత్‌‌‌‌డ్రా మాత్రం రూ. 3, 500 చేశాడనుకుందాం. అప్పుడు కచ్చితంగా ట్రాన్సాక్షన్‌‌‌‌ ఫెయిల్‌‌‌‌ అవుతుంది. ఈ ఫెయిల్ అయిన ట్రాన్సాక్షన్‌‌‌‌పై బ్యాంకులు ఛార్జ్‌‌‌‌లను వసూలు చేస్తాయన్న మాట. కిందటేడాది డిసెంబర్ నుంచి ఈ రూల్‌‌‌‌ అమల్లోకి వచ్చింది. 
రూ. 20–25 వరకు ఛార్జ్‌‌‌‌ 
వివిధ బ్యాంకులను బట్టి ఈ ఛార్జీలలో మార్పులున్నాయి. సరిపడినంత డబ్బులు లేకపోవడంతో ట్రాన్సాక్షన్లు ఫెయిలైతే  ఆ ట్రాన్సాక్షన్‌‌‌‌పై రూ. 20 పెనాల్టీని స్టేట్‌‌‌‌బ్యాంక్ ఆఫ్ ఇండియా వసూలు చేస్తోంది. దీనికి అదనంగా జీఎస్‌‌‌‌టీ ఛార్జీలు కూడా ఉంటాయని గుర్తుంచుకోవాలి. ఇతర ఏటీఎంలు లేదా విదేశాలలోని మర్చంట్ అవుట్‌‌‌‌లెట్ల వద్ద ట్రాన్సాక్షన్ ఫెయిలైతే రూ. 25 లను హెచ్‌‌‌‌డీఎఫ్‌‌‌‌సీ బ్యాంక్ ఛార్జ్‌‌‌‌ చేస్తోంది(ట్యాక్స్‌‌‌‌లు అదనం).  కోటక్ మహింద్రా బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్‌‌‌‌, యెస్ బ్యాంక్‌‌‌‌, ఐసీఐసీఐ బ్యాంకులు కూడా ఫెయిలైన ఏటీఎం ట్రాన్సాక్షన్లపై రూ. 25 ఛార్జ్ 
చేస్తున్నాయి.