అధిష్టానం ఆదేశిస్తే ఎక్కడి నుంచైనా పోటీ

అధిష్టానం ఆదేశిస్తే ఎక్కడి నుంచైనా పోటీ

కాంగ్రెస్ అధ్యక్షులు రాహుల్‌ గాంధీ ఆదేశిస్తే తాను ఎక్కడి నుంచైనా పోటీ చేయటానికి సిద్ధంగా ఉన్నానన్నారు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌. ఈ సారి ఎన్నికల్లో దిగ్విజయ్‌ క్లిష్టమైన స్థానాన్ని ఎంచుకోవాలన్న మధ్యప్రదేశ్‌ సీఎం కమల్‌నాథ్‌ వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. సవాళ్లను స్వీకరించడం తనకు అలవాటేనని 1977లో తాను రాఘోగఢ్‌ నుంచి పోటీ చేసి గెలిచానన్నారు. రాహుల్‌ గాంధీ ఆదేశించిన స్థానం నుంచి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని దిగ్విజయ్‌ సింగ్‌ వ్యాఖ్యానించారు.

ఎంత క్లిష్టమైన స్థానం నుంచి పోటీ చేసైనా గెలిచే సామర్థ్యం తనకు ఉందని కమల్‌నాథ్‌ భావిస్తున్నారని అభిప్రాయపడ్డారు. అందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు దిగ్విజయ్‌ సింగ్‌.
దిగ్విజయ్‌ పోటీ చేయాలనుకుంటే రాష్ట్రంలోని క్లిష్టమైన స్థానం ఎంపిక చేసుకోవాలని కమల్‌నాథ్‌ శనివారం ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు.