కూర్చునే పొజిషన్​ సరిగా లేకుంటే..

కూర్చునే పొజిషన్​ సరిగా లేకుంటే..

కరోనా థర్డ్​వేవ్ ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. చాలా కంపెనీలు మళ్లీ ‘వర్క్​ ఫ్రమ్​ హోమ్’ పెంచేశాయి.​ మళ్లీ ఇంటి నుంచి పని చేయమంటున్నాయి.  అయితే, ఆఫీసులో ఉన్నంత సౌకర్యం ఇంట్లోఉండదు. ‘వర్క్ ఫ్రమ్​ హోమ్’​లో సోఫా, బెడ్, కుషన్స్​ మీద కూర్చొని కంప్యూటర్​, ల్యాప్​టాప్​ ముంగట వేసుకునే వాళ్లే ఎక్కువ. సరిగా కూర్చోక పోవడంతో స్పాండిలైటిస్  (ఇన్​ఫ్లమేటరీ కండిషన్​) కూడా వచ్చే అవకాశం ఉంది అంటున్నారు ఆర్థోపెడిక్​ సర్జన్​ డాక్టర్​ మనోజ్​ కుమార్​. 
వర్క్ ఫ్రమ్​ హోమ్​లో బ్రేక్ తీసుకునేవాళ్లు చాలా తక్కువ. ఒకేచోట కూర్చొని ఎక్కువ టైం పనిచేస్తారు. సిస్టం పొజిషన్​ ఆఫీసులో ఉన్నట్టుగా ఇంట్లో ఉండదు. దాంతో చాలామంది ల్యాప్​టాప్​ చేతిలో పట్టుకొని వర్క్​ చేస్తారు. కొందరైతే సోఫాలో, బెడ్‌‌ మీద పడుకొని పని చేస్తుంటారు. 
బాడీ పోశ్చర్​తో సమస్యలు
బాడీ పోశ్చర్​ సరిగా లేకపోవడం వల్ల రెండు మూడు రోజుల్లోనే బ్యాక్​పెయిన్, నెక్​పెయిన్​​ మొదలవుతుంది.  మెడ నరాలు తల బరువుని మోయలేక  బిగుతుగా అవుతున్నాయి. దీంతో, మెడలోని డిస్క్​లో ప్రాబ్లమ్స్ వస్తాయి. చేతులు తిమ్మిర్లు పట్టడం, చెయ్యంతా లాగడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ల్యాప్​టాప్​, కంప్యూటర్ స్క్రీన్ తక్కువ ఎత్తులో ఉన్నప్పుడు15‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–2‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌0 డిగ్రీస్​ల మేర మెడను కిందికి దించాల్సి వస్తుంది. దాంతో తల బరువు మెడ మీద 3‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌0–40 % ఎక్కువ పడుతుంది. మెడ, వెన్నెముక ఎముకలు ఒకే వరుసలో ఉండడం వల్ల ఎక్కువగా అరుగుతున్నాయి. కొందరు పెయిన్​కిల్లర్స్ వాడుతూ వర్క్​ కంటిన్యూ చేస్తారు. కానీ, వారం రోజుల తర్వాత మెడనొప్పి ఎక్కువవుతుంది. అప్పుడు పెయిన్​ కిల్లర్స్ వాడినా రిలీఫ్​ ఉండదు. 
విటమిన్​–డి లోపం
ఇంతకు ముందు ఆఫీస్​కు, వేరే పనికి బయటికి వెళ్లేవాళ్లు. దాంతో, విటమిన్​–డి బాగా అందేది. కానీ, ఇప్పుడు ఇంట్లోనే ఉండడం వల్ల విటమిన్​–డి అందక బోన్ డెన్సిటీ తగ్గిపోతోంది. దీంతో ఆస్టియోపొరోసిస్, ఆస్టియోపీనియా వంటి సమస్యలు రావొచ్చు. స్పాండిలైటిస్ అనేది మొదటి దశ. ఈ సమస్య ఎక్కువైతే స్పాండిలోసిస్ వచ్చే ఛాన్స్​ ఉంటుంది.  
ఈ సమస్య రాకుండా
ఎత్తు మార్చుకోవడానికి వీలుగా ఉన్న కంఫర్టబుల్ కుర్చీ ఉపయోగించాలి. కాళ్లు నేలకి తాకేలా కూర్చోవాలి. బ్యాక్​రెస్ట్​గా కుర్చీలో పిల్లో లేదా టవల్ పెట్టుకుంటే మరీ బెటర్​. అలాగే, కంప్యూటర్​, ల్యాప్​టాప్​ స్క్రీన్​ కళ్లకి సమానంగా ఉండాలి. ఇలా చేస్తే ఎక్కువ టైం ఇబ్బంది లేకుండా వర్క్​ చేసుకోవచ్చు. మెడ మీద స్ట్రెస్​ పడదు. బాడీ పోశ్చర్​ సరిగా ఉండేందుకు నిటారుగా కూర్చోవాలి.  ప్రతి 45 నిమిషాలకి బ్రేక్​ తీసుకోవడం తప్పనిసరి. కాసేపు నడవాలి. చేతులు, కాళ్లు రిలాక్స్​ అవ్వడం కోసం స్ట్రెచింగ్ ఎక్సర్​సైజ్​లు చేయాలి. మెడని గట్టిపరిచే వ్యాయామాలు చేయాలి. ఈ జాగ్రత్తలతో స్పాండిలైటిస్​ని అడ్డుకోవచ్చు. దాంతో స్పాండిలోసిస్​, డిస్క్​ ప్రాబ్లమ్స్​ స్టేజ్​కి వెళ్లకుండా చూసుకోవచ్చు. 
కంప్యూటర్ ముందు ఎక్కువ సమయం కూర్చున్నా కూడా ఇబ్బందిగా అనిపించొద్దు అంటే వారానికి కనీసం రెండున్నర గంటలు వ్యాయామం చేయాలి. వాకింగ్‌‌, ఏరోబిక్స్, జుంబా, సైక్లింగ్​, స్విమ్మింగ్​, స్కిప్పింగ్​, నడవడం వంటివి చేస్తే మంచిది. నొప్పి, స్పర్శ కోల్పోవడం, కండరాలు వీక్​ అవ్వడం వంటి లక్షణాలు తరచూ కనిపిస్తుంటే వెంటనే డాక్టర్​ని కలవాలి. నొప్పి మరింత తీవ్రంగా ఉంటే రెస్ట్​ తీసుకోవాలి. పోశ్చర్​ సరి చేసుకునేందుకు పనికొచ్చే ఎక్సర్​సైజ్​లు చేయాలి.  
కార్పల్​ టన్నెల్​ సిండ్రోమ్​
ఆఫీసులో  మోచేతిని 90 డిగ్రీల కోణంలో పెట్టి మౌస్​ యూజ్​ చేసేవాళ్లు. కానీ ఇంటివద్ద  మౌస్​ని అలా యూజ్​ చేయకపోవడం వల్ల చాలామందికి ‘కార్పల్​ టన్నెల్​ సిండ్రోమ్’ వస్తోంది. ఈ సిండ్రోమ్​ ఉన్నవాళ్లలో​ అరచేతిలోని ఒక నరానికి రక్తసరఫరా ఆగిపోయి చేయి తిమ్మిరి వస్తుంది.