నాగర్కర్నూల్, వెలుగు: శ్రీశైలం ఎడమగట్టు కెనాల్(ఎస్ఎల్బీసీ) పనుల పురోగతి కోసం ఎన్జీఆర్ఐ సైంటిస్టులు మన్నెవారిపల్లె నుంచి చేపట్టిన ఎయిర్ బోర్న్ మ్యాగ్నిటిక్ సర్వే శనివారం పూర్తయింది. దోమలపెంటలోని ఇన్లెట్ నుంచి మన్నెవారిపల్లె ఔట్లెట్ వరకు నల్లమల అడవిలో 44 కిలోమీటర్ల పొడవున్న ఎస్ఎల్బీసీ టన్నెల్ తవ్వాల్సిన ప్రదేశానికి ఇరువైపులా 3 కిలోమీటర్ల వెడల్పులో సర్వే నిర్వహించారు. సర్వేలో సేకరించిన వివరాలను15 రోజుల్లో విశ్లేషించి ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక అందిస్తామని ఎన్జీఆర్ఐ చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ సత్యనారాయణ వెల్లడించారు. అనేక సవాళ్ల మధ్య సర్వేను విజయవంతంగా పూర్తి చేసినట్లు ఆయన తెలిపారు.
