
బాల్కనీ, లివింగ్ రూమ్‌లో పూల మొక్కలు ఉంటే మనసంతా ఆహ్లాదంగా ఉంటుంది. అందుకనే కొంచెం ప్లేస్ ఉన్నా కూడా రకరకాల పూలమొక్కల్ని పెంచుకుంటారు చాలామంది. అయితే, వాటికి రోజూ నీళ్లు పోయడం, అప్పుడప్పుడు కుండీల్లోని మట్టి మార్చడం కుదరని వాళ్లు ఆర్టిఫీషియల్ పూలమొక్కలు తెచ్చుకుంటారు. వీటిని సిల్క్, లాటెక్స్తో తయారుచేస్తారు. వీటి పూలు అచ్చం తోటలో పెంచిన పూల మొక్కలకు పూసిన పువ్వుల్లా ఉంటాయి.
వీటిని జంతువులు, పక్షుల బొమ్మలు, చిన్న సైకిల్ కుండీల్లో పెట్టి షెల్ఫ్స్, వర్కింగ్ టేబుల్ మీద పెడితే ఇల్లంతా కొత్తగా కనిపిస్తుంది. గాజు కుండీల్లో పెట్టి గోడకు వేలాడదీయొచ్చు. దోస్తులు, బంధువులకు గిఫ్ట్‌గా ఇచ్చేందుకు బాగుంటాయి కూడా. అంతేకాదు ఫంక్షన్లు, పార్టీల టైంలో ఇంటికి వచ్చిన గెస్ట్‌లు కళ్లన్నీ వీటి మీదే ఉంటాయి. ఆన్లైన్లో వీటి ధర రూ. 450 నుంచి మొదలవుతుంది. కుండీల రకం, డిజైన్, సైజ్‌ని బట్టి ధరలో తేడా ఉంటుంది.