ఫోన్‌‌‌‌‌‌‌‌లో ‘ఎంఆధార్’ ఉంటే ఆధార్ ఉన్నట్టే

 ఫోన్‌‌‌‌‌‌‌‌లో ‘ఎంఆధార్’ ఉంటే ఆధార్ ఉన్నట్టే

న్యూఢిల్లీ :  యూజర్లు తమ ఆధార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కార్డు వివరాలను స్టోర్ చేసుకోవడానికి   యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) ఎంఆధార్ యాప్‌‌‌‌‌‌‌‌ను తీసుకొచ్చింది. అడ్రస్‌‌‌‌‌‌‌‌, క్యూఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోడ్ వంటి వివరాలను ఈ యాప్ సాయంతో ఈజీగా పొందొచ్చు. రిజస్టర్డ్ నెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో లింక్ అయిన ఆధార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కార్డ్‌‌‌‌‌‌‌‌లను మాత్రమే  ఎంఆధార్‌‌‌‌ యాప్‌‌‌‌‌‌‌‌లో ఓపెన్ చేసుకోవడానికి వీలుంటుంది. మొదట యూజర్లు రిజిస్టర్ చేసుకోవాలి. ఓటీపీ సాయంతో వెరిఫికేషన్ పూర్తి చేయాలి.

ప్రాసెస్ ఇలా..

1. ఎంఆధార్‌‌‌‌యాప్‌‌‌‌‌‌‌‌ను ఓపెన్ చేశాక ‘రిజిస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆధార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ ను క్లిక్ చేయాలి.
2. ప్రొఫైల్‌‌‌‌‌‌‌‌ను యాక్సెస్ చేసుకోవడానికి నాలుగు డిజిట్ల పిన్‌‌‌‌‌‌‌‌ లేదా పాస్‌‌‌‌‌‌‌‌వర్డ్‌‌‌‌‌‌‌‌ను జనరేట్ చేసుకోవాలి.
3. ఆధార్ నెంబర్ వివరాలను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత కాప్చా కోడ్‌‌‌‌‌‌‌‌ ఫిల్ చేయాలి. రిజిస్టర్డ్‌‌‌‌‌‌‌‌ నెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఓటీపీ వస్తుంది.
4. ఓటీపీ ఎంటర్ చేశాక సబ్మిట్ చేయాలి.
5. రిజిస్ట్రేషన్ సక్సెస్‌‌‌‌‌‌‌‌ఫుల్‌‌‌‌‌‌‌‌గా పూర్తయ్యాక  సంబంధిత యూజర్ వివరాలు డిస్‌‌‌‌‌‌‌‌ప్లే అవుతాయి.
6. మెనూలోని కింది ట్యాబ్‌‌‌‌‌‌‌‌ ‘మై ఆధార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ ను క్లిక్ చేసి పిన్‌‌‌‌‌‌‌‌ లేదా పాస్‌‌‌‌‌‌‌‌వర్డ్‌‌‌‌‌‌‌‌ను ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయాలి. డ్యాష్‌‌‌‌‌‌‌‌ బోర్డ్ ఓపెన్ అవుతుంది.

ఎంఆధార్ ఆఫర్ చేస్తున్న బెనిఫిట్స్‌‌‌‌‌‌‌‌..

1. ఆధార్ వివరాలను ఆఫ్‌‌‌‌‌‌‌‌లైన్ మోడ్‌‌‌‌‌‌‌‌లో చూసుకోవచ్చు.
2. ఒకే ఫోన్‌‌‌‌‌‌‌‌లో ఐదుగురు ఫ్యామిలీ మెంబర్ల ఆధార్ వివరాలను స్టోర్ చేసుకోవచ్చు.
3. ఐడెంటిటీ వెరిఫికేషన్‌‌‌‌‌‌‌‌ మరింత సమర్ధవంతంగా జరగాలనుకుంటే యూజర్లు తమ కేవైసీ (నో యువర్ కస్టమర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) లేదా క్యూఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోడ్ వివరాలను సర్వీస్‌‌‌‌‌‌‌‌ ప్రొవైడర్లతో పంచుకోవచ్చు.
4.  బయోమెట్రిక్ వంటి అదనపు సెక్యూరిటీ విధానాలు కూడా ఉన్నాయి.