ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఆర్మూర్, వెలుగు :  క్రీడాకారులు శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉంటేనే క్రీడల్లో రాణించగలరని ట్రిపుల్​ ఒలంపియన్, పద్మశ్రీ అవార్డు గ్రహీత, తెలంగాణ హాకీ సంఘం ప్రధాన కార్యదర్శి ముఖేశ్‌‌కుమార్‌‌‌‌ అన్నారు.  హాకీ క్రీడాకారుడు రఘురాం స్మారకార్థం ఆర్మూర్‌‌‌‌ మినీ స్టేడియంలో ఏర్పాటు చేసిన 7వ రాష్ట్ర స్థాయి (అండర్– 19) మహిళల హాకీ పోటీలను శనివారం మున్సిపల్ చైర్‌‌‌‌పర్సన్‌‌ పండిత్ వినిత పవన్‌‌తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ రాష్ట్ర స్థాయి టోర్నీకి ఎనిమిది జిల్లాల నుంచి జట్లు వచ్చాయి. టోర్నీ ప్రారంభానికి ముందు రఘురాం మృతికి సంతాపంగా రెండు నిమిషాలు మౌనం పాటించారు. కార్యక్రమంలో హాకీ అసోసియేషన్ జిల్లా ప్రెసిడెంట్ విశాఖ గంగారెడ్డి, జిల్లా కార్యదర్శి రమణ, కోశాధికారి సురేందర్, వైస్ ప్రెసిడెంట్ గంగా మోహన్ చక్రు, ఒలంపిక్​ అసోసియేషన్​ ప్రెసిడెంట్ గడిల రాములు, పేట జిల్లా ప్రెసిడెంట్ విద్యాసాగర్‌‌‌‌రెడ్డి, హనుమాన్ యూత్ క్లబ్ మెంబర్లు, సీనియర్ హాకీ క్రీడాకారులు పాల్గొన్నారు.

మత్స్య సొసైటీలకు చేప పిల్లల పంపిణీ

లింగంపేట, వెలుగు: మండలంలోని 14 మత్స్య సహాకార సొసైటీ సభ్యులకు శనివారం ఎంపీపీ గరీబున్నీసా 15 లక్షల చేప పిల్లలను శనివారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా మత్స్య శాఖ ఆధ్వర్యంలో ఎంపీడీవో ఆఫీస్ ఆవరణలో జరిగిన కార్యక్రమంలో ఎంపీపీ మాట్లాడుతూ మండలంలోని 57 చెరువుల్లో సొసైటీల సభ్యులు చేప పిల్లలను వదలాలని సూచించారు. మత్స్యకారుల ఆర్థిక అభివృద్ధి కోసం ప్రభుత్వం ఉచితంగా చేప పిల్లలను సరఫరా చేస్తుందన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో నారాయణ, వైస్ ఎంపీపీ విఠల్‌‌రెడ్డి, ఎంపీవో ప్రభాకర్‌‌‌‌చారి, మత్స్యశాఖ ఇన్‌‌స్పెక్టర్ అక్తర్​ మొయినొద్దీన్, పీల్డ్ ఆఫీసర్​సురేశ్‌‌గౌడ్, మత్స్య సహాకార సంఘం మండల అధ్యక్షుడు గంగారాం తదితరులు పాల్గొన్నారు. కాగా, జూన్, జూలైలో ఇవ్వాల్సిన చేప పిల్లలను ఆఫీసర్లు మూడు నెలలు ఆలస్యంగా అక్టోబర్​29న ఇవ్వడంపై కొందరు చేపల పెంపకందారులు కొద్దిసేపు నిరసన వ్యక్తం జేశారు. 

సర్పంచ్‌‌పై చర్యలు తీసుకోవాలి

లింగంపేట, వెలుగు: తమ విధులకు ఆటంకం కలిగించిన సర్పంచ్‌‌పై చర్యలు తీసుకోవాలని లేకుంటే సోమవారం నుంచి విధులను బహిష్కరిస్తామని జూనియర్ పంచాయతీ సెక్రటరీలు పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం మండలంలోని ఎంపీడీవోకు వినతిపత్రం అందజేశారు. మండలంలోని భవానీపేట జూనియర్​పంచాయతీ సెక్రటరీ అశోక్ భవానీపేట్ అటవీ శివారులో గురువారం పోడు భూముల సర్వే నిర్వహిస్తుండగా జల్దిపల్లి సర్పంచ్ రవీందర్ దుర్భాషలాడుతూ తన విధులకు ఆటంకం కలిగించాడని అందులో పేర్కొన్నారు. సర్పంచ్‌‌పై చర్యలు తీసుకోవాలని ఎంపీడీవో నారాయణకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. ఇప్పటికైనా స్పందించకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో జూనియర్ పంచాయతీ సెక్రటరీలు అశ్వాక్, శ్రీనివాస్, అశోక్, లావణ్య, సత్యవతి, సంధ్య, ప్రశాంత్, శేఖర్ పాల్గొన్నారు.  

రేపు ట్రైనీ ఐఏఎస్‌‌, ఐపీఎస్‌‌ల రాక

ఏర్పాట్లను పరిశీలించిన జడ్పీ సీఈవో

కోటగిరి, వెలుగు: ఈ నెల 31న మండలంలోని ఎత్తొండ గ్రామానికి ట్రైనీ ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లు రానున్నారు. పంచాయతీ బిల్డింగ్‌‌ వారి విడిది కోసం చేస్తున్న ఏర్పాట్లను జడ్పీ సీఈవో గోవింద్ శనివారం పరిశీలించారు. ఆఫీసర్లు ట్రైనింగ్‌‌లో భాగంగా క్షేత్ర స్థాయిలో జరుగుతున్న అభివృద్ధి పనులు, అమలవుతున్న సంక్షేమ పథకాలను స్టడీ చేసేందుకు నవంబర్ 5 వరకు కోటగిరి మండలంలో పర్యటిస్తారని చెప్పారు. వారికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేయాలని ఇన్‌‌చార్జి ఎంపీడీవో, తహసీల్దార్‌‌‌‌ శ్రీకాంత్‌‌రావుకు సూచించారు.  ఆయన వెంట సర్పంచ్ సాయిబాబా, ఎంపీటీసీ ఫారుఖ్ ఉన్నారు.

కొనుగోలు కేంద్రాల్లోనే గిట్టుబాటు ధర

వర్ని, వెలుగు: రైతులు పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించేందుకే ప్రభుత్వం కొనుగోలు సెంటర్లను ఏర్పాటు చేస్తోందని స్పీకర్‌‌‌‌ పోచారం శ్రీనివాస్‌‌‌‌రెడ్డి చెప్పారు. నిజామాబాద్ జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలోని రుద్రూర్, కోటగిరి, వర్ని, చందూర్, మోస్రా మండలాల్లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మిస్తున్న వారికి చెక్కులను అందజేశారు. అనంతరం రుద్రూర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాన్ని స్పీకర్‌‌‌‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నిజాంసాగర్‌‌‌‌లో నీళ్లు పుష్కలంగా ఉన్నాయని, రైతులు యాసంగి పంటలపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. కార్యక్రమంలో ఆయా మండలాల  ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు

ఆన్‌‌ లైన్‌‌ బిజినెస్‌‌ పేరుతో మోసం

పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు

నిజామాబాద్ క్రైమ్, వెలుగు: ఆన్‌‌లైన్‌‌ బిజినెస్‌‌ పేరుతో తమను మోసం చేశారని పట్టణంలో గంగాస్థాన్‌‌కు చెందిన శివరంజని ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం ప్రెస్‌‌ క్లబ్‌‌లో ఆమె విలేకరులతో మాట్లాడారు. పట్టణానికి చెందిన దండి వెంకట్, సబ్బని లత గంగాస్థాన్‌‌కు చెందిన బాస లత, ప్రియలకు తమను పరిచయం చేయించారని తెలిపారు. ఆన్‌‌ లైన్‌‌ గ్రూప్ బిజినెస్‌‌లో చేరితే నెలకు రూ.20 వేల జీతం వస్తుందని వారు ఆశ చూపడంతో మూడు నెలల కింద చేరినట్లు చెప్పారు. ఒక్కో గ్రూపునకు రూ.14 వేల చొప్పున ఆరు గ్రూపుల్లో చేరినందుకు తనతో రూ.84 వేలు కట్టించుకున్నారని వివరించారు. అయితే ఆ బిజినెస్‌‌ నచ్చక గ్రూప్‌‌ నుంచి ఎగ్జిట్‌‌ అయిన తన నుంచి రూ.1.20 ఫెనాల్టీ కట్టించుకున్నారని పేర్కొన్నారు. ఇంకా రూ.17.79 లక్షలు బాకీ ఉన్నారని వేధిస్తున్నారని తెలిపారు. ఆన్‌‌ లైన్‌‌ బిజినెస్ పేరుతో తమన మోసగించిన వారిపై చర్యలు తీసుకోవాలని పట్టణ పోలీస్ స్టేషన్‌‌లో ఫిర్యాదు చేసినట్లు ఆమె తెలిపారు. కాగా, బాధితురాలి ఫిర్యాదు మేరకు ఏడుగురిపై కేసు ఫైల్‌‌ చేసినట్లు పోలీసులు చెప్పారు.

పౌష్టికాహారం అందించాలి

కామారెడ్డి, వెలుగు: గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం సక్రమంగా అందేలా చూడాలని  కామారెడ్డి జడ్పీ చైర్‌‌‌‌పర్సన్ దఫేదర్ శోభ పేర్కొన్నారు. శనివారం  స్ర్తీ, శిశు సంక్షేమ శాఖ, అగ్రీకల్చర్, సాంఘిక సంక్షేమ శాఖల స్టాండింగ్​ కమిటీ మీటింగ్‌‌లు చైర్‌‌‌‌పర్సన్ అధ్యక్షతన జరిగాయి. ఆయా శాఖల ఆధ్వర్యంలో  జరుగుతున్న  కార్యక్రమాలను ఆఫీసర్లు సభ్యులకు వివరించారు.  అనంతరం ఆమె మాట్లాడుతూ అంగన్‌‌వాడీ సెంటర్లను ఆఫీసర్లు తరచూ విజిట్ చేయాలన్నారు.  రైతు బీమా సొమ్ము చెల్లింపులో జాప్యం లేకుండా చూడాలన్నారు. అయిల్ పామ్ తోటల పెంపకంపై రైతులను అవగాహన కల్పించాలన్నారు.  సీఈవో సాయాగౌడ్, ఆఫీసర్లు, జడ్పీటీసీలు పాల్గొన్నారు.  

చేపల పెంపకాన్ని ప్రోత్సహించాలి

కామారెడ్డి, వెలుగు: చేపలు, రొయ్యల పెంపకం చేపట్టేలా రైతులను ప్రోత్సహించాలని కామారెడ్డి కలెక్టర్ జితేష్​ వి పాటిల్ పేర్కొన్నారు. శనివారం ఉపాధి హామీ పనుల పురోగతిపై కలెక్టరేట్‌‌లో మండల స్థాయి ఆఫీసర్లతో మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌‌‌‌ మాట్లాడుతూ ఉపాధి హామీ స్కీమ్ కింద చేపలు, రొయ్యల పెంపకం కోసం రైతులు ఊట కుంటలను నిర్మించుకోవచ్చన్నారు. జాబ్​కార్డు కోసం అప్లయ్ చేసుకున్న వారికి వెంటనే శాంక్షన్ చేయాలని ఆఫీసర్లకు సూచించారు. డీఆర్డీవో సాయన్న, ఏపీవోలు, ఎంపీడీవోలు, టెక్నికల్ అసిస్టెంట్లు
 పాల్గొన్నారు.