Beauty Tips : సీతాఫలం ఆకులతో ఇలా చేసే మంచి అందం

Beauty Tips : సీతాఫలం ఆకులతో ఇలా చేసే మంచి అందం

టెస్టోస్టిరాన్ హార్మోన్ తక్కువగా ఉండటం, జెనిటిక్ కారణాల వల్ల స్టోస్టిరాన్ హార్మోన్ తక్కువగా కొందరికి ముఖంపై వెంట్రుకలు వస్తాయి. ఈ సమస్య నుంచి బయటపడేందుకు ఈ వంటింటి టిప్స్..

* అర టేబుల్ స్పూన్ పసుపులో ఒక అర టేబుల్ స్పూన్ బియ్యప్పిండి వేసి బాగా కలపాలి. ఆ మిశ్రమాన్ని అవాంఛిత రోమాలున్న చోట రాయాలి. పదినిమిషాల తర్వాత ముఖాన్ని మసాజ్ చేయాలి. ఇలా వారానికోసారి చేస్తే అవాంఛిత రోమాలు ఊడిపోతాయి. 

* అరటిపండు గుజ్జులో రెండు టీ స్పూన్ ఓట్మీల్ కలిపి రోమాల మీద రాసి ఇరవైనిమిషాల తర్వాత కడిగినా రిజల్ట్ బాగుంటుంది. 

* పుదీనా రసం వారానికోసారి మూడు నెలలపాటు తాగితే ముఖంపై వెంట్రుకలు రాలిపోతాయి. అలాగే సీతాఫలం ఆకులను ముద్దగా నూరి వెంట్రుకలపై ప్యాక్ వేసినా ఫలితం ఉంటుంది. 

* కోడిగుడ్డు తెల్లసొనలో అర టేబుల్ స్పూన్ మొక్కజొన్నపిండి, ఒక టేబుల్ స్పూన్ చక్కెర వేసి బాగా కలపాలి. ఆ మిశ్రమాన్ని ముఖంపై అవాంఛిత రోమాలున్న చోట రాసి 20 నిమిషాల తర్వాత ఆ ప్యాక్ని వేళ్లతో నెమ్మదిగా మసాజ్ చేస్తూ తీసేయాలి. ఇలా తరచూ చేస్తే అవాంఛిత రోమాల సమస్య నుంచి తేలికగా బయటపడొచ్చు.