కాక‌ర‌కాయ తింటే షుగ‌ర్ పెర‌గ‌దా.. ఇందులో నిజం ఎంత‌

కాక‌ర‌కాయ తింటే షుగ‌ర్ పెర‌గ‌దా.. ఇందులో నిజం ఎంత‌

రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం ఒక్కసారి ప్రారంభమైతే... జీవిత కాలం కొనసాగుతుంది. మధుమేహం ప్రపంచవ్యాప్తంగా 422మిలియన్ల మందిపై ప్రభావం చూపిస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ప్రతి సంవత్సరం 1.6మిలియన్ల మంది చనిపోతున్నారని ప్రకటించింది. ఇన్సులిన్ స్థాయిలు మధుమేహంలో ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. రక్తంలో చక్కెర, కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచడానికి పలు పండ్లు, కూరగాయలు సహాయపడతాయి. వాటిలో కాకరకాయ ఒకటి.

కాకరకాయం రక్తంలో చక్కెర స్థాయిలను ఎలా నియంత్రిస్తుందంటే..

టైప్ 2 మధుమేహ రోగుల్లో కాకరకాయ చక్కెర స్థాయిలను నియంత్రిస్తుందని ఎథ్నోఫార్మకాలజీ జర్నల్ లో ఓ కథనం వెలువడింది. కాబట్టి రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడానికి కాకరకాయ గొప్ప మార్గంగా తెలుస్తోంది. అయితే వీటిని వారానికి ఒకటి లేదా రెండు సార్లు మాత్రమే తీసుకోవాలని, అతిగా తినకూడదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

కాకరకాయలో కొవ్వు, కేలరీలు తక్కువగా ఉన్నందున బరువును అదుపులో ఉంచడంలో సహాయపడుతుంది. శరీరానికి శక్తిని కూడా అందిస్తుంది. జీవక్రియ రేటును పెంచడానికి, జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో కాకరకాయ ప్రముఖ పాత్ర పోషిస్తుంది.

కాకరకాయ వల్ల వచ్చే సమస్యలు :

  • అతిసారం
  • వాంతులు
  • యోని రక్తస్రావం
  • రక్తంలో చక్కెర స్థాయిల్లో భారీ తగ్గుదల
  • కాలేయం దెబ్బతింటుంది
  • రక్తహీనత

సో.. కాకరకాయ షుగర్ పేషెంట్లకు మంచిదే కానీ.. ఎక్కువగా తింటే మాత్రం అనారోగ్యం కొనితెచ్చుకున్నట్లే. వారానికి ఒకటి, రెండుసార్లు వరకు కాకరకాయ తింటే షుగర్ లెవల్లో పెరగకుండా ఉంటాయనేది నిపుణుల మాట.