నేచురల్​ ఇంగ్రెడియెంట్​ రెసిపీతో జుట్టుకు ఆరోగ్యం

నేచురల్​ ఇంగ్రెడియెంట్​ రెసిపీతో జుట్టుకు ఆరోగ్యం

జుట్టు  పలుచబడినా,  పొడిబారినా, కుదుళ్లు కాస్త చిట్లినా, రంగు మారినా.. హెయిర్​ కేర్​ కోసం అని షాంపూలు మార్చేస్తుంటారు చాలామంది. రకరకాల​  ప్రొడక్ట్స్​ ట్రై చేస్తుంటారు. కానీ, ఈ సమస్యలన్నింటికీ సొల్యూషన్​ వంటింట్లోనే ఉంది. కిచెన్​లో ఉండే ఈ నేచురల్​ ఇంగ్రెడియెంట్​ రెసిపీని రోజూ తింటే జుట్టు ఆరోగ్యంగా, అందంగా ఉంటుంది. 

పాన్​లో ఒక కప్పు అవిసె గింజలు, అర కప్పు నల్ల నువ్వులు, ఒక టీ స్పూన్​ పింక్​ సాల్ట్​ వేసి,  మీడియం మంట మీద ఏడు నిమిషాలు వేగించాలి. ఈ మిశ్రమాన్ని రోజుకి పది గ్రాముల చొప్పున పగలు లేదా రాత్రి భోజనానికి అరగంట తర్వాత తినాలి. ఇలా రోజు చేస్తే అవిసె గింజల్లోని ఒమెగా– 3 ఫ్యాటీ యాసిడ్స్​ , విటమిన్​–బి, సి, యాంటీ ఇన్​ఫ్లమేటరీ గుణాలు హెయిర్​ ఫాల్​ని కంట్రోల్ చేస్తాయి. జుట్టు ఎదుగుదలకి సాయం చేస్తాయి. నువ్వుల్లోని ఐరన్​, యాంటీ ఆక్సిడెంట్స్​ కూడా జుట్టు తెల్లబడకుండా చేస్తాయి.