ఒకరి వెంటపడితే 11 మందిమి తరిమికొడతం

ఒకరి వెంటపడితే 11 మందిమి తరిమికొడతం

లండన్: ప్రతిష్టాత్మక లార్డ్స్ టెస్టులో టీమిండియా అదరగొట్టింది. ఓడిపోయే దశ నుంచి ప్రత్యర్థి వెన్ను విరిచి గెలిచిన తీరు అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇంగ్లండ్ ను మట్టి కరిపించి సాధించిన ఈ విక్టరీ ఎప్పటికీ మర్చిపోలేనిదని సీనియర్ క్రికెటర్లు, ఫ్యాన్స్ కొనియాడుతున్నారు. ఈ నేపథ్యంలో గెలుపులో సెంచరీతో కీలకపాత్ర పోషించిన బ్యాట్స్ మన్ కేఎల్ రాహుల్ స్పందించాడు. టీమిండియా అంటే ఏ ఒక్క ప్లేయరో కాదని.. పదకొండు మందితో కూడిన సమూహమని రాహుల్ అన్నాడు. స్లెడ్జింగ్ చేస్తే ఊరుకోబోమని వార్నింగ్ ఇచ్చాడు.

'రెండు భీకరమైన జట్లు తలపడినప్పుడు మ్యాచ్ ఉత్కంఠగా సాగుతుంది. ఇవ్వాళ మా బౌలర్లు అదరగొట్టారు. ఇంగ్లండ్ పై పదేపదే ఒత్తిడి పెంచుతూ విజయం సాధించాం. మా జట్టులో ఏ ఒక్క ప్లేయర్ నో టార్గెట్ చేసుకుంటే మేం ఊరుకోం. అతడితో మిగతా పది మంది కలసి ప్రత్యర్థి జట్టుపై పోరాడతాం. అందరం కలసి వారిని తరిమికొడతాం' అని రాహుల్ పేర్కొన్నాడు.