లిమిట్​ దాటి అప్పులు చేస్తే..కొంప కొల్లేరే!

లిమిట్​ దాటి అప్పులు చేస్తే..కొంప కొల్లేరే!

బిజినెస్​డెస్క్, వెలుగు​: డబ్బు విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోకుంటే   అప్పుల ఊబిలో కూరుకుపోవడం ఖాయం. జనాభాలో ఎక్కువ మంది, ముఖ్యంగా జీతం ఉన్నవారు తరచూ అప్పులు తీసుకుంటారు. బాధ్యతా రహితంగా అప్పులు తీసుకోవడం తీవ్ర సమస్యలకు దారి తీస్తుంది. మీరు అప్పుల​ ఉచ్చులో పడ్డారని సూచించే పరిస్థితులు ఏంటో చూద్దాం. ఈ సంకేతాలను గుర్తించడం ద్వారా,  తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. 

ఆదాయంలో 50 శాతం కంటే ఎక్కువ ఈఎంఐలకే

మనలో చాలా మంది 'ఈజీ ఈఎంఐలు', 'తగ్గింపులు',  'సేల్స్'  ఆకర్షణకు లోనవుతారు. అనవసర ఖర్చులో మునిగిపోవడం వల్ల మీ ఆర్థిక పరిస్థితి దెబ్బతింటుంది. మిమ్మల్ని అప్పుల ఊబిలో పడేస్తుంది. తరచూ ఆఫర్లు రావడంతో చాలా మందికి ఏదో ఒకటి కొనాలనే ఆశ పుడుతుంది. 
 

చేతిలో డబ్బు లేకుండా ఈజీ ఈఎంఐల బాట పడుతుంటారు. వ్యక్తిగత ఈఎంఐలు సులువే అనిపించినప్పటికీ, వీటి వల్ల ఇతర ఖర్చులకు డబ్బులు సరిపోవు. కిస్తీల విలువ నెలవారీ ఆదాయంలో 50శాతం కంటే తక్కువగా ఉండాలి. అనేక బ్యాంకులు వ్యక్తులు ఈ 50శాతం పరిమితి మించకుండా నిరోధించడానికి పరిమితులను కూడా విధించాయి.  

సాధారణ ఖర్చుల కోసం అప్పు

రోజువా=రీ ఆర్థిక అవసరాలను తీర్చుకోవడానికి మీరు తరచుగా అప్పు తీసుకుంటే, మీ ఆర్థిక పరిస్థితి గురించి మరోసారి ఆలోచించుకోవాలి. అద్దె,  పిల్లల స్కూల్ ఫీజులు వంటి సాధారణ ఖర్చులను కవర్ చేయడానికి అప్పులు తీసుకోవడం వల్ల రుణఊబిలోకి కూరుకుపోయే అవకాశాలు మెండుగా ఉంటాయి. రోజువారీ ఖర్చులను భరించడానికి కష్టపడే వ్యక్తులు తరచూ అప్పులు తీసుకుంటారు. అయితే ఈ వ్యూహంపై ఆధారపడటం సహజంగానే ప్రమాదకరం.  అప్పుల ఊబిలో చిక్కుకునే అవకాశం పెరుగుతుంది.

క్రెడిట్ కార్డ్ నుంచి డబ్బు తీసుకోవడం

అప్పులను తీర్చడానికి, సాధారణ ఖర్చుల కోసం అప్పులు తీసుకోవడం తెలివితక్కువ పని. అటువంటి వాటి కోసం క్రెడిట్ కార్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను ఉపయోగించడం వల్ల అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. క్రెడిట్ కార్డ్ ద్వారా నగదు తీయడానికి భారీగా చార్జీలు వసూలు చేస్తారు. ఇది 2.5శాతం నుంచి 3.5శాతం వరకు ఉంటుంది. వార్షిక ప్రాతిపదికన, అసోసియేటెడ్​వడ్డీ 35శాతం నుంచి 50శాతం వరకు చేరవచ్చు.

క్రెడిట్ కార్డ్ బకాయిలను కట్టకపోవడం 

క్రెడిట్ కార్డ్ బకాయిలను పూర్తిగా తీర్చడంలో విఫలమవడం డేంజరే! ఒక సర్వే ప్రకారం, దాదాపు 21శాతం మంది  క్రెడిట్ కార్డ్ బిల్స్​ చెల్లించడం లేదు లేదా గత సంవత్సరంలో కనీస బకాయి మొత్తాన్ని మాత్రమే చెల్లించడం ద్వారా దాన్ని రోల్ ఓవర్ చేశారు.  రోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఓవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తే విపరీతమైన వడ్డీలు, చార్జీలను భరించాల్సి ఉంటుంది. కార్డు ‘మినిమం అమౌంట్​’ తక్కువగా ఉంటుంది కాబట్టే దానిని కట్టేసి ఊరుకుంటారు. దీనివల్ల అప్పుల ఊబిలో కూరుకుపోయే ప్రమాదం ఉంది. క్రెడిట్ కార్డ్ బ్యాలెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను ఫార్వర్డ్ చేసినా మూడుశాతం వడ్డీ భరించాలి. మీరు ఈ రోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఓవర్ చక్రంలో చిక్కుకున్నట్లు అనిపిస్తే, వెంటనే దాని నుంచి తప్పించుకోవాలి. ఈ  ట్రాప్ నుంచి బయటపడటానికి అవసరమైతే మీ పెట్టుబడులలో కొన్నింటిని వాడండి. 

భవిష్యత్ ఆదాయం ఆధారంగా అప్పులు తీసుకోవడం

ఈ సంవత్సరం చివర్లో మీకు బోనస్ వస్తుంది కాబట్టి మీరు ఇప్పుడే అప్పు తీసుకుంటే మీరు ఇబ్బందుల్లో పడవచ్చు. ఎందుకంటే పరిస్థితులు ఎప్పుడు ఎలా ఉంటాయో తెలియదు. ప్రస్తుత జీతం ఆధారంగా అప్పు తీసుకోవడం మంచిదే కానీ రాబోయే బోనస్, ఇంక్రిమెంట్లు మొదలైన వాటిపై కాదు. ప్రజలు తాము భరించగలిగే ఈఎంఐలను లెక్కించేటప్పుడు జీతం సరిపోతుందో లేదో చెక్​ చేసుకోవాలి. ఫిక్స్​డ్​ పేను మాత్రమే మీ జీతంగా పరిగణించండి.  మీ ఈఎంఐ ఫిక్స్​డ్​ పేలో 50శాతం కంటే ఎక్కువ ఉండకూడదు.

పెరుగుతున్న ఈఎంఐలతో అప్పులు

చాలా మంది  భవిష్యత్​లో వచ్చే జీతం, ఇంక్రిమెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను ఎక్కువగా అంచనా వేస్తారు.  కెరీర్  ప్రారంభ దశల్లో  ఇంక్రిమెంట్లు సాధారణంగా ఎక్కువగా ఉంటాయి. ఈ ఇంక్రిమెంట్లు రిటైర్మెంట్​వరకు కొనసాగకపోవచ్చు.   కొన్ని సంవత్సరాల తర్వాత వచ్చే ఆదాయంపై లోన్​ ఉత్పత్తులను అందించడం ద్వారా ఆర్థిక సంస్థలు కూడా ఈ అనారోగ్యకరమైన అలవాట్లకు కారణమవుతున్నాయి. చాలా మంది ఫ్లోటింగ్ రేట్ హోమ్ లోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను ఎంచుకుంటారు కాబట్టి, వడ్డీ రేట్ల పెంపు వల్ల వచ్చే ఈఎంఐలలో ఆకస్మిక పెరుగుదలకు సిద్ధంగా ఉండాలి. కిస్తీలు 20శాతం వరకు పెరిగే అవకాశం ఉందని గుర్తుంచుకొని  లోన్ రీపేమెంట్ కోసం ప్రత్యేకంగా  నిధులను కేటాయించడం మంచిది. లేకపోతే ఇబ్బందులు వస్తాయి.

ఆదాయంలో 70శాతం కంటే ఎక్కువ స్థిర ఖర్చులు

ఈఎంఐ అనేది ఒక వ్యక్తి  స్థిర ఖర్చుల్లో (అద్దె, బీమా, స్కూలు ఫీజులు వంటివి) కేవలం ఒక భాగం మాత్రమే.   స్థిర ఖర్చుల విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి. స్థిర బాధ్యతలు-ఆదాయ నిష్పత్తి ఎఫ్​ఓఐఆర్​ 50శాతం మించకూడదు. 50శాతం ఎఫ్​ఓఐఆర్​ సాధించడం ప్రతి ఒక్కరికీ సాధ్యం కానప్పటికీ, 70శాతం పరిమితిని దాటడం అనేది లోన్​ ఉచ్చులోకి ప్రవేశించడానికి ముందస్తు హెచ్చరిక.  కాబట్టి 70శాతం మార్కును దాటనివ్వకూడదు. నెలవారీ ఆదాయంలో కనీసం 30శాతం మిగుల్చుకుంటే అదనపు ఖర్చులను భరించడంతోపాటు ఆర్థిక లక్ష్యాల కోసం ఆదా చేయవచ్చు.

లోన్ తిరిగి చెల్లించడానికి అప్పు

వడ్డీ ఖర్చులను తగ్గించడం, హోం లోన్ రీఫైనాన్స్ చేయడం వంటివాటి  కోసం తప్ప, అప్పు తిరిగి చెల్లించడానికి డబ్బు తీసుకోవడం మంచిది కాదు. ఇలాంటి వ్యక్తులు తమ స్థిర బాధ్యతలను నెరవేర్చడం కూడా కష్టమే! సాధారణంగా, సామాజిక ఒత్తిళ్ల కారణంగా జనం హోంలోన్​,  కారు లోన్​ ఈఎంఐలు, అలాగే అద్దె  పాఠశాల ఫీజులు వంటి చెల్లింపులను వాయిదా వేయడానికి వెనుకాడతారు. బదులుగా, కొందరు క్రెడిట్ కార్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను ఆశ్రయిస్తారు. అవసరమైన కనీస మొత్తాన్ని మాత్రమే చెల్లిస్తూ అప్పును పెంచుకుంటూ పోతారు. అందుకే చాలా మందికి క్రెడిట్​బిల్స్​  భారీగా పేరుకుపోతాయి. 

బ్యాంకులు లోన్​ను  నిరాకరించడం

బ్యాంకుల నుంచి మీ లోన్​ దరఖాస్తు తిరస్కరణకు గురికావడం అనేది కచ్చితంగా డేంజర్​ బెల్లే!  మీ క్రెడిట్ స్కోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తక్కువగా ఉంటేనే ఈ పరిస్థితి వస్తుంది.  చాలా బ్యాంకులు 750 కంటే ఎక్కువ స్కోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను కోరుకుంటాయి. కొన్ని నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు తక్కువ స్కోరు ఉన్నా లోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇస్తున్నాయి. 
తక్కువ క్రెడిట్ రేటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు ఉన్న వాళ్ల నుంచి ఎక్కువ వడ్డీ వసూలు చేస్తారు. క్రెడిట్ స్కోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని మెరుగుపరచడానికి వెంటనే చర్యలు తీసుకోవడం మంచిది. సీనియర్ సిటిజన్లు కూడా తమ క్రెడిట్ స్కోర్ ప్రాముఖ్యతను విస్మరించకూడదు. పదవీ విరమణ చేసిన వారికి, మంచి క్రెడిట్ స్కోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కొనసాగించడం చాలా ముఖ్యం. 

యుటిలిటీ బిల్స్​ కట్టకపోవడం

అప్పుడప్పుడు యుటిలిటీ బిల్లులు కరెంట్​, వాటర్​, పేపర్​ బిల్స్​ మిస్ కావడం వల్ల ప్రమాదం ఏమీ లేదు. తరచూ ఇటువంటి బిల్లులను చెల్లించడం ఆపేస్తే మాత్రం మీ ఆర్థిక సామర్థ్యం బలహీనపడుతున్నట్టే!  పరిస్థితి చేయి దాటిపోతోందని అర్థం చేసుకోవాలి. ఆర్థిక అక్షరాస్యతను పెంచుకోవాలి. ఇలాంటివి జరిగితే మీ క్రెడిట్ స్కోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దెబ్బతింటుంది. తక్కువ వడ్డీకి లోన్లు దొరకడం కష్టమవుతుంది.