జుట్టు అందంగా కనిపించాలంటే..

V6 Velugu Posted on Sep 21, 2021

ఎంత కేర్​ తీసుకున్నా కొన్నిసార్లు జుట్టు పొడిబారి చిట్లిపోతుంది. దానివల్ల ఎంత గ్రాండ్​గా హెయిర్​ స్టయిల్​ చేసుకున్నా లుక్​ రాదు.  ఈ సమస్య నుంచి బయటపడాలంటే ... గుడ్డుసొనలో ఒక టీ స్పూన్​ తేనె, కొంచెం ఆలివ్ ఆయిల్ కలిపి జుట్టుకు రాయాలి. అరగంట తర్వాత గోరువెచ్చని నీళ్లతో తలస్నానం చేయాలి. ఇలా వారానికోసారి చేస్తే జుట్టుకి కావాల్సిన ప్రొటీన్లు అంది హెల్దీగా పెరుగుతుంది.  ఒక టీ స్పూన్​ ఆలివ్‌ నూనె, ఒక టీ స్పూన్​ కొబ్బరి నూనెలో 4 చుక్కల గులాబీనూనె కలిపి జుట్టుకు పట్టించాలి. 20 నిమిషాలు మసాజ్​ చేయాలి. 
ఇలా వారానికోసారి చేస్తే జుట్టు హెల్దీగా ఉంటుంది. 

Tagged life style, hair, Beautiful,

Latest Videos

Subscribe Now

More News