Nail Care: గోళ్లు అందంగా కలర్ ఫుల్గా కనిపించాలంటే.. నెయిల్ పాలిష్ ఇట్ల వేసుకోవాలె

Nail Care: గోళ్లు అందంగా కలర్ ఫుల్గా కనిపించాలంటే.. నెయిల్ పాలిష్ ఇట్ల వేసుకోవాలె

నెయిల్ పాలిష్ మరింత కలర్ పుల్ గా కనిపించాలంటే ఈ టిప్స్ ఫాలో అవ్వాలి..

* నెయిల్ పాలిష్ వేసుకునేముందు గోళ్లని శుభ్రంగా కడిగి, షేప్ చేయాలి. అలాగే గోళ్లలో తడి లేకుండా చూసుకోవాలి. 

* గోళ్లకి మొదట వైట్ కలర్ నెయిల్ పాలిష్ తో బేస్ కోట్ వేయాలి. అది పూర్తిగా ఆరాక నెయిల్ పాలిష్ అప్లై చేయాలి. 

• గోళ్ల రంగుని గోరు మొదలు నుంచి చివరి వరకు ఒకే యాంగిల్లో వేయాలి. మొదట కాస్త పలుచగా వేసి... అది ఆరాక మరోసారి నెయిల్ పాలిష్ వేస్తే పర్ ఫెక్ట్ వస్తుంది.

• నెయిల్ పాలిష్ వేసుకున్న గోళ్లను ఐస్ క్యూబ్స్ కరిగించిన చల్లటి నీళ్లలో ముంచాలి. అలా చేస్తే వేసుకున్న రంగు చిటికెలో ఆరిపోతుంది.

• గోళ్ల రంగు వేసినప్పుడు బబుల్స్ ఏర్పడకుండా ఉండాలంటే బాటిల్ ని ఎక్కువగా ఊపకూడదు.

• నెయిల్ స్టిక్కర్స్ వాడేటప్పుడు వాటిని గోరు అంచుల దాకా అంటించాలి. దాని మీద పూసే టాప్ కోట్ నెయిల్ పాలిష్ కూడా గోరు అంచుల వరకూ వేయాలి.