మల్టీ జోన్-1లో ఇద్దరు ఇన్‌స్పెక్టర్లపై వేటు

మల్టీ జోన్-1లో ఇద్దరు ఇన్‌స్పెక్టర్లపై వేటు

మల్టీ జోన్ 1 పరిధిలో అవినీతికి పాల్పడిన ఇద్దరు ఇన్‌స్పెక్టర్లపై వేటు పడింది.  ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని సత్తుపల్లి గ్రామీణ ప్రాంతంలో పేకాటరాయళ్ళకు సహకరిస్తూ, జూదగృహలను ప్రోత్సాహిస్తూ అవినీతికి పాల్పడుతున్న సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఎన్ వెంకటేశంతో పాటు అధికారాన్ని దుర్వినియోగం చేసి తప్పుడు కేసులు నమోదు చేసినందుకు ములుగు జిల్లాలో స్పెషల్ బ్రాంచ్ లో విధులు నిర్వహిస్తున్న ఇన్‌స్పెక్టర్ సి హెచ్ శ్రీధర్ లను సస్పెండ్ చేస్తూ ఐజీ ఏ వి రంగనాథ్ ఉత్తర్వులు జారీ  చేశారు. 

అలాగే.. మతకల్లోల సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహారించినందుకు మెదక్ పట్టణ, రూరల్ ఇన్స్ స్పెక్టర్లు ఎస్ దిలీప్ కుమార్, బి కేశవులతోపాటు అధికార పర్యవేక్షణలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ సర్కిల్ ఇన్స్ స్పెక్టర్ బి రాజేశ్వర్ రావును మల్టీ జోన్ 1 ఐజీ కార్యాలయానికి అటాచ్ చేశారు.