
న్యూఢిల్లీ: దేశంలోని కీలక ఇండస్ట్రీల ప్రొడక్షన్ ఈ ఏడాది జులైలో 3.5 శాతం వృద్ధి చెందింది. ఇది గత నాలుగు నెలల్లో అత్యధిక స్థాయి. తయారీ రంగం రాణించడమే ఇందుకు కారణం. ఈ ఏడాది మార్చిలో 3.9శాతం వృద్ధి నమోదవ్వగా, ఆ తర్వాత నుంచి ఈ లెవెల్ కంటే తగ్గుతూ వచ్చింది. కానీ గత ఏడాది జులైలో ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రీయల్ ప్రొడక్షన్ (ఐఐపీ) 5 శాతంగా రికార్డయ్యింది.
నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ (ఎన్‌ఎస్‌ఓ) ప్రకారం, ఈ ఏడాది జులైలో తయారీ రంగం 5.4శాతం వృద్ధిని సాధించింది. ఈ ఏడాది జనవరిలో నమోదైన 5.8 శాతం గ్రోత్ తర్వాత ఇదే ఎక్కువ. మైనింగ్ సెక్టార్‌లో ఉత్పత్తి 7.2శాతం తగ్గగా, విద్యుత్ ఉత్పత్తి కేవలం 0.6 శాతం మాత్రమే పెరిగింది.