వరల్డ్‌‌ యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌‌లో .. దేశంలో ఐఐఎస్సీ బెంగళూరు టాప్‌

వరల్డ్‌‌ యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌‌లో .. దేశంలో ఐఐఎస్సీ బెంగళూరు టాప్‌

న్యూఢిల్లీ: వరల్డ్‌‌ యూనివర్సిటీ ర్యాంకింగ్స్​లో ఇండియన్‌‌ ఇన్‌‌స్టిట్యూట్‌‌ ఆఫ్‌‌ సైన్స్‌‌ (ఐఐఎస్సీ) బెంగళూరు యూనివర్సిటీ దేశంలోనే టాప్‌‌ స్థానంలో నిలిచింది. గురువారం టైమ్స్‌‌ హయ్యర్‌‌‌‌ ఎడ్యుకేషన్‌‌ వరల్డ్‌‌ యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌‌ 2024ను విడుదల చేసింది. ఫిజికల్‌‌ సైన్సెస్‌‌, ఇంజినీరింగ్‌‌, కంప్యూటర్‌‌‌‌ సైన్స్‌‌, లైఫ్ సైన్స్‌‌ ఈ నాలుగు సబ్జెక్టుల్లో మొదటి స్థానంలో నిలిచింది. ఫిజికల్‌‌ సైన్సెస్‌‌ విభాగంలో ఐఐఎస్‌‌ బెంగళూరు వర్సిటీ 201–250 ర్యాంకుల కేటగిరీలో నిలిచింది. అలాగే, ఇంజినీరింగ్‌‌ విభాగంలో 101–125 కేటగిరీలో, కంప్యూటర్ సైన్స్‌‌ సబ్జెక్ట్‌‌ విభాగంలో 101–125 కేటగిరీలో, లైఫ్‌‌ సైన్సెస్‌‌ విభాగంలో 201–250 ర్యాంకుల కేటగిరీలో స్థానం లభించింది. 

అలాగే, ఇంజినీరింగ్‌‌ విభాగంలో అన్నా యూనివర్సిటీ 301–400 ర్యాంకుల కేటగిరీలో నిలిచింది. జామియా మిల్లియా ఇస్లామియా, లవ్లీ ప్రొఫెషనల్‌‌ యూనివర్సిటీ, శూలిని యూనివర్సిటీ ఆఫ్‌‌ బయెటెక్నాలజీ అండ్‌‌ మేనేజ్‌‌మెంట్‌‌ సైన్సెస్‌‌, శిక్ష ఓ అనుసంధాన్‌‌ డీమ్డ్‌‌ యూనివర్సిటీలు 401–500 ర్యాంకుల కేటగిరీలో స్థానం దక్కించుకున్నాయి. ఆలీగఢ్​ ముస్లిం యూనివర్సిటీ, ఐఐటీ గౌహతి, ఇంటర్నేషనల్‌‌ ఇన్‌‌స్టిట్యూట్‌‌ ఆఫ్‌‌ ఇన్ఫర్మేషన్‌‌ టెక్నాలజీ హైదరాబాద్‌‌, జేపీ యూనివర్సిటీ ఆఫ్‌‌ ఇన్ఫర్మేషన్‌‌ టెక్నాలజీ, కేఐఐటీ యూనివర్సిటీ, యూపీఈఎస్‌‌, సవితా ఇన్‌‌స్టిట్యూట్‌‌ ఆఫ్‌‌ మెడికల్‌‌ అండ్‌‌ టెక్నికల్‌‌ సైన్సెస్‌‌, థప్పర్ ఇన్‌‌స్టిట్యూట్‌‌ ఆఫ్‌‌ ఇంజినీరింగ్‌‌ అండ్‌‌ టెక్నాలజీ, వీఐటీ యూనివర్సిటీలు 501–600 ర్యాంకుల కేటగిరీలో నిలిచాయి. 

అమేటి యూనివర్సిటీ, అమృత విశ్వ విద్యాపీఠం, బిర్లా ఇన్‌‌స్టిట్యూట్‌‌ ఆఫ్‌‌ టెక్నాలజీ అండ్‌‌ సైన్స్ పిలానీ, ఢిల్లీ టెక్నలాజికల్‌‌ యూనివర్సిటీ, ఇండియన్‌‌ ఇన్‌‌స్టిట్యూట్‌‌ ఆఫ్‌‌ టెక్నాలజీ (ఇండియన్ స్కూల్‌‌ ఆఫ్‌‌ మైన్స్) ధన్‌‌బాద్‌‌, ఇండియన్‌‌ ఇన్‌‌స్టిట్యూట్‌‌ ఆప్‌‌ టెక్నాలజీ పట్నా వర్సిటీ ఇంజినీంగ్‌‌ విభాగంలో 601–800 ర్యాంకుల కేటగిరీలో స్థానం దక్కించుకున్నాయి. యూనివర్సిటీ ఆఫ్‌‌ ఢిల్లీ, జవహర్‌‌‌‌లాల్‌‌ నెహ్రూ యూనివర్సిటీ ఆర్ట్స్‌‌ అండ్‌‌ హ్యుమానిటీస్‌‌ సబ్జెక్టుల్లో 501–600 ర్యాంక్‌‌ కేటగిరీలో టాప్‌‌ స్థానంలో నిలిచాయి. 

దేశంలో సైకాలజీ సబ్జెక్ట్‌‌లో యూనివర్సిటీ ఆఫ్‌‌ ఢిల్లీ మాత్రమే 401–500 ర్యాంకుల కేటగిరీలో నిలిచింది. బిజినెస్‌‌ అండ్‌‌ ఎకనామిక్స్‌‌ సబ్జెక్ట్‌‌లో జామియా మిల్లియా ఇస్లామియా యూనివర్సిటీ 401–500 ర్యాంకుల కేటగిరీలో దేశంలోనే టాప్‌‌గా నిలిచింది. క్లినికల్‌‌ అండ్‌‌ హెల్త్‌‌ విభాగంలో మణిపాల్‌‌ అకాడమీ ఆఫ్ హయ్యర్‌‌‌‌ ఎడ్యుకేషన్‌‌ 201–250 ర్యాంకుల కేటగిరీలో టాప్‌‌ స్థానం దక్కించుకుంది. సోషల్‌‌ సైన్సెస్‌‌ సబ్జెక్ట్‌‌లో లవ్లీ ప్రొఫెషనల్‌‌ యూనివర్సిటీ 401–500 కేటగిరీలో టాప్‌‌ ర్యాంక్‌‌ను సొంతం చేసుకుంది.