
శర్మన్ జోషి, శ్రియా శరణ్ లు జంటగా, ఇళయరాజా సంగీతం అందించిన చిత్రం 'మ్యూజిక్ స్కూల్' షూటింగ్ హైదరాబాద్‌లో ముగిసింది. ద్విభాషా మ్యూజికల్‌గా హిందీ, తెలుగు భాషలలో నిర్మించిన ఈ మూవీ హైదరాబాద్, గోవాలలో విస్తృతంగా చిత్రీకరించారు. కాగా ఈ చిత్రానికి లెజెండరీ మాస్ట్రో ఇళయరాజా మ్యూజిక్ ను అందించగా, పాపా రావు బియ్యాల దర్శకత్వం వహించారు. ఈ మూవీని యామిని ఫిల్మ్స్ బ్యానర్‌పై యామిని రావు బియ్యాలా నిర్మించారు. పదకొండు పాటలకు హాలీవుడ్ కొరియోగ్రాఫర్ ఆడమ్ ముర్రే, భారతీయ కొరియోగ్రాఫర్లు చిన్ని ప్రకాష్, రాజు సుందరం కొరియోగ్రఫీ చేశారు. ఈ చిత్రంలోని మూడు పాటలు 'ది సౌండ్ ఆఫ్ మ్యూజిక్'లోనివి. దీని అధికారిక హక్కులను దర్శకుడు పాపారావు సొంతం చేసుకున్నారు.
చిత్ర దర్శకుడు సినిమాటోగ్రాఫర్ కిరణ్ డియోహాన్స్‌కి కు భారీ క్రెడిట్ ఇవ్వడంతో, షూటింగ్ చివరి రోజున తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. "దర్శకుడు పాపారావుతో 'ది మ్యూజిక్ స్కూల్' షూటింగ్ ఎంతో సరదాగా జరిగింది. దాన్ని ఎంజాయ్ చేస్తూ ఈ ఫిల్మ్ చేశాను. యామిని ఫిల్మ్స్ టీమ్ మొత్తాన్ని మిస్ అవుతున్నాను. కాబట్టి వీడ్కోలు చెప్పడం కూడా ఇష్టం లేదని ఆయన ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు.
యామిని ఫిలింస్ నిర్మించిన ఈ 'మ్యూజిక్ స్కూల్'లో షాన్, ప్రకాష్ రాజ్, లీలా శాంసన్, సుహాసిని ములే, బగ్స్ భార్గవ, మంగళా భట్, ఫణి ఎగ్గోటి, వక్వార్ షేక్, ప్రవీణ్ గోయెల్ తదితరులు నటించారు. కాగాఈ సినిమా విడుదల తేదీని ఇంకా ప్రకటించాల్సి ఉంది.