మేడారంలో అన్ని సౌలత్‌‌లు కల్పిస్తాం : ఇలా త్రిపాఠి

మేడారంలో అన్ని సౌలత్‌‌లు కల్పిస్తాం : ఇలా త్రిపాఠి

తాడ్వాయి, వెలుగు : మేడారం మహాజాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తామని ములుగు కలెక్టర్‌‌ ఇలా త్రిపాఠి చెప్పారు. మేడారంలో జరుగుతున్న పనులను శనివారం పరిశీలించి మాట్లాడారు. పనులన్నీ నెలాఖరులోగా పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఆఫీసర్లు ఎప్పటికప్పుడు పనులను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నట్లు తెలిపారు.

పనులు క్వాలిటీగా, ఇన్‌‌టైంలో పూర్తయ్యేలా జిల్లా స్థాయి ఆఫీసర్లతో జోనల్‌‌ టీంలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కన్నెపల్లిలోని సారలమ్మ ఆలయం వద్ద టాయిలెట్స్‌‌కు, స్ట్రీట్‌‌ లైట్స్‌‌కు రిపేర్లు చేయించాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఎండోమెంట్‌‌ ఈవో రాజేందర్‌‌, పీఆర్‌‌ఈఈ అజయ్‌‌కుమార్‌‌, డీపీవో వెంకయ్య, తాడ్వాయి తహసీల్దార్‌‌ రవీందర్ పాల్గొన్నారు.

ఆదివాసీ మ్యూజియాన్ని పరిశీలించిన పీవో

మేడారంలోని ఆదివాసీ మ్యూజియాన్ని శనివారం ఐటీడీఏ పీవో అంకిత్‌‌ సందర్శించారు. భవనానికి సంబంధించిన పెయింటింగ్‌‌ పనులను పరిశీలించి, ఆదివాసీ సంస్కృతి సంప్రదాయాలకు సాక్ష్యంగా ఉండాలని సూచించారు. కాంపౌండ్‌‌ వాల్‌‌ పెయింటింగ్‌‌ పనులను వారం రోజుల్లో పూర్తి చేయాలని చెప్పారు. అంతకుముందు ఐటీడీఏ గెస్ట్‌‌హౌజ్‌‌లో రిపేర్లను పరిశీలించి, పనులను రెండు రోజుల్లో పూర్తి చేయాలని చెప్పారు. ఆయన వెంట ఏపీవో వసంతరావు, ఐటీడీఏ స్టాటిస్టికల్‌‌ ఆఫీసర్‌‌ రాజ్‌‌కుమార్‌‌, ట్రైబల్‌‌ వెల్ఫేర్‌‌ డీఈ చందర్, ఏఈ దేవిశ్రీ పాల్గొన్నారు.