టేకులపల్లి, వెలుగు: ఇందిరమ్మ ఇండ్లతో పేదల సొంతింటి కల సాకారమవుతోందని ఇల్లందు ఎమ్మెల్యే కోరెం కనకయ్య అన్నారు. సోమవారం టేకులపల్లి మండలంలోని బేతంపూడిలో నిర్మాణం పూర్తయిన ఇంటిని సోమవారం ఆయన ప్రారంభించారు.
అనంతరం లబ్ధిదారులతో గృహప్రవేశం చేయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పదేండ్ల బీఆర్ ఎస్ హయాంలో పేదలకు ఇండ్లు ఇవ్వలేదని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సీఎం రేవంత్రెడ్డి నాయకత్వంలో లక్షల ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నామని పేర్కొన్నారు.
కాంగ్రెస్ జిల్లా నాయకుడు కోరెం సురేందర్, ఇల్లందు మార్కెట్ కమిటీ చైర్మన్ రాంబాబు నాయక్, సీఐ సత్యనారాయణ, హౌసింగ్ ఏఈ గణేశ్, నాయకులు గణేశ్, బాబు, సర్దార్, విజయ్, సుదీప్ తదితరులు పాల్గొన్నారు.
మహిళలను ఆర్థికంగా బలోపేతం చేస్తాం
కామేపల్లి, వెలుగు: మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని ఇల్లందు ఎమ్మెల్యే కోరెం కనకయ్య అన్నారు. సోమవారం కామేపల్లి రైతు వేదికలో ఇందిరా మహిళా శక్తి చీరలు, కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వం మహిళల సంక్షేమాన్ని నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. కాంగ్రెస్అధికారంలోకి వచ్చాక సీఎం రేవంత్రెడ్డి కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలన్న లక్ష్యంతో ముందుకెళ్తున్నారని పేర్కొన్నారు.
డీఆర్డీఏ ఏపీడీ జయశ్రీ, డీపీఎం ఆంజనేయులు, తహసీల్దార్ సుధాకర్, ఎంపీడీవో రవీందర్, ఇల్లందు మార్కెట్ కమిటీ చైర్మన్ రాంబాబు, కాంగ్రెస్ మండల అధ్యక్షులు గింజల నర్సిరెడ్డి, కామేపల్లి, కొండాయిగూడెం సొసైటీ చైర్మన్లు వీరభద్రం,హనుమంతరావు తదితరులున్నారు.
