సింగారం గ్రామంలో ఉద్రిక్తత

సింగారం గ్రామంలో ఉద్రిక్తత

రాజన్న సిరిసిల్ల/ఎల్లారెడ్డిపేట, వెలుగు: ఎల్లారెడ్డిపేట మండలం సింగారం గ్రామంలో మంగళవారం ఉదయం ఉద్రిక్తత నెలకొంది. దర్శాల గుట్టపై ఉన్న ఓ వ్యక్తి అక్రమంగా నిర్మాణాలు చేపట్టాడన్న, ఫిర్యాదుల నేపథ్యంలో తెల్లవారుజామున తహసీల్దార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సుజాత.. సిబ్బందితో వచ్చి కూల్చివేయించారు. ఈక్రమంలో గుట్టను సందర్శించేందుకు బీజేపీ లీడర్లు రాగా పోలీసులు అడ్డుకున్నారు. బీజేపీ లీడర్లు తమ గ్రామానికి రావొద్దని, ఇక్కడ ప్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పెట్టి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే చంపేస్తామని ఓ మాజీ సర్పంచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అన్న మాటలు సోషల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మీడియాలో వైరల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయ్యాయి.

దీంతో బీజేపీ లీడర్లు అక్కడికి చేరుకొని ‘తమను సంపమనండి ఇక్కడే ఉన్నామని’ పోలీసులతో వాగ్వాదం చేశారు. వెంటనే వారిని అదుపులోకి తీసుకొని సిరిసిల్ల పోలీస్ స్టేషన్ కు తరలించారు. దీంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. గుట్ట పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విధించారు. ఎస్పీ మహేశ్ బి గీతే, డీఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి ఘటనా స్థలాన్ని పరిస్థితిని సమీక్షించారు. సీఐ శ్రీనివాస్ గౌడ్, ఎస్ఐ రమాకాంత్, సిబ్బంది
 పాల్గొన్నారు.

దర్శవాలి గుట్ట భూములను కాపాడాలి 

ఎల్లారెడ్డిపేట మండలం సింగారం గ్రామంలోని దర్శావళి గుట్ట భూములను కాపాడాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి దర్శావళి గుట్టను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధి పేరిట గుట్టను ఓ మతానికి చెందిన వ్యక్తి ఆక్రమించినా ఇన్నాళ్లూ అధికారులు చోద్యం చూశారని ఆరోపించారు.

కాకతీయుల కాలం నుంచి గుట్టపై లక్ష్మీనరసింహస్వామి, హనుమాన్ విగ్రహాలు ఉండేవని, ఇప్పుడు వాటి ఆనవాళ్లు లేకుండా చేశారని, వాటిని సందర్శించేందుకు వెళ్తుంటే అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. ఇటీవల గుట్టపై ఉర్సు ఉత్సవాలు నిర్వహించారని, ఇందుకు స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ వచ్చి చాదర్ కప్పి వెళ్లారన్నారు. తాము అభివృద్ధికి అడ్డుకాదని, కానీ ఆ పేరు చెప్పి హిందువుల మనోభవాలను దెబ్బతీయొద్దన్నారు.