
ఆసిఫాబాద్, వెలుగు: మహారాష్ట్ర నుంచి కారులో అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని వాంకిడి పోలీసులు పట్టుకున్నారు. ఎస్సై ప్రశాంత్ తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం రాత్రి సిబ్బందితో పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా మహారాష్ట్రలోని చంద్రపూర్ నుంచి కారులో ఆసిఫాబాద్ వైపు అనుమానాస్పదంగా వెళ్తుండగా వాంకిడి ఆర్టీఏ చెక్ పోస్ట్ వద్ద ఆపి తనిఖీలు చేశారు.
వారి వద్ద అక్రమంగా తీసుకొస్తున్న మహారాష్ట్ర మద్యం లభ్యమైంది. మొత్తం మద్యం విలువ సుమారు రూ.లక్షా 4 వేలు ఉంటుందని చెప్పారు. మద్యాన్ని స్వాధీనం చేసుకుని మహారాష్ట్ర గడ్చందూర్కు చెందిన సుదర్శన్, రాజేంద్ర, పాపయ్యపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు.