మాజీ సీఎం జగన్ కు షాక్: ఇంటిముందు అక్రమ నిర్మాణాలు కూల్చివేత..

మాజీ సీఎం జగన్ కు షాక్: ఇంటిముందు అక్రమ నిర్మాణాలు కూల్చివేత..

ఏపీ మాజీ సీఎం జగన్ కు జీహెచ్ఎంసీ అధికారులు షాక్ ఇచ్చారు. హైదరాబాద్ లోని జగన్ నివాసం లోటస్ పాండ్ ముందు అక్రమంగా నిర్మించిన గదులను కూల్చివేశారు టౌన్ ప్లానింగ్ అధికారులు. గతంలో జగన్ భద్రత కోసం రోడ్డును ఆక్రమించి గదులు నిర్మించినట్లు గుర్తించిన అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. రోడ్డును ఆక్రమించి నిర్మాణాలు చేయటంతో వాహనదారులకు ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఈ నిర్మాణాల వల్ల రోడ్డు ఇరుకుగా మారిందని వాహనదారుల నుండి ఫిర్యాదు అందుకున్న జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు వాటిని కూల్చేశారు.జేసీబీలతో పోలీసు బందోబస్తు మధ్య ఈ కూల్చివేతలు చేపట్టారు అధికారులు. అసలే ఎన్నికల్లో ఘోర ఓటమి చవి చుసిన జగన్ కు ఇది గట్టి షాక్ అనే చెప్పాలి.