టేకులపల్లి, వెలుగు: టేకులపల్లి మండలంలోని ముత్యాలంపాడు క్రాస్ రోడ్డు రైతు వేదికలో బుధవారం 82మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను, 15మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య పాల్గొని పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పేదింటి ఆడబిడ్డల పెళ్లి భారం కాకుండా కల్యాణ లక్ష్మి పథకం ద్వారా ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం అందిస్తుందని, పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు కోరం సురేందర్, టేకులపల్లి తహసీల్దార్ లంకపల్లి వీరభద్రం, ఆత్మ కమిటీ చైర్మన్ బోడ మంగీలాల్ నాయక్, స్థానిక సర్పంచ్ బానోత్ పూలబంతి, నాయకులు ఈది గణేశ్, మోకాళ్లపోషాలు, ఇస్లావత్ రెడ్యానాయక్, అజ్మీరా శివ, మూడ్ సంజయ్, సుదీప్, సర్పంచులు, తదితరులు పాల్గొన్నారు.
