దేశవ్యాప్తంగా భారీ వర్షాలు.. హెచ్చరికలు జారీ చేసిన ఐఎండీ

దేశవ్యాప్తంగా భారీ వర్షాలు.. హెచ్చరికలు జారీ చేసిన ఐఎండీ

దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అండమాన్, నికోబార్ దీవులు, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వంటి రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.

ఛత్తీస్‌గఢ్, పశ్చిమ బెంగాల్, గోవా, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, కర్నాటక రాష్ట్రాలకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలోని పలు ప్రాంతాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. అంతకుముందు సెప్టెంబర్ 2న IMD తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. సెప్టెంబరు 7 వరకు రెండు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది.