లఢక్ కు IRCTC టూర్ ప్యాకేజీ

లఢక్ కు IRCTC టూర్ ప్యాకేజీ

 

ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ కార్పొరేషన్ (IRCTC) తన ప్రయాణికుల కోసం ఎక్సోటిక్ టూర్ ప్యాకేజీ పేరుతో  షామ్ వ్యాలీ, లేహ్, నుబ్రా, తుర్తుక్  మరియు పాంగోంగ్ సందర్శనలతో సహా ఆరు-రాత్రులు,  ఏడు రోజుల ప్రయాణాన్ని అందిస్తుంది

ఎక్సోటిక్ టూర్ ప్యాకేజీ పేరుతో  ఐఆర్‌సీటీసీ ఈ టూర్‌ ప్యాకేజీని అందిస్తోండ‌గా.. జూన్ 28న‌ ఈ ప్యాకేజీని  బుక్‌ చేసుకోవచ్చు. ఈ టూర్ ప్యాకేజీలో లేహ్(LEH), లద్దాఖ్(Ladakh), షామ్ వ్యాలీ(Sham Valley), నుబ్రా (Nubra), తుర్తుక్ (TURTUK), పాంగాంగ్ (Pangong) లాంటి పర్యాటక ప్రాంతాలు సందర్శించవచ్చు. హైదరాబాద్ నుంచి టూర్ ప్రారంభం అవుతుండ‌గా..  6 రాత్రులు, 7 రోజులు కొనసాగుతుంది. ఈ ప్యాకేజీ బుక్ చేసుకున్న పర్యాటకులకు ఫ్లైట్‌లో తీసుకెళ్లి లడఖ్ అందాలను ఐఆర్‌సీటీసీ టూరిజం (IRCTC Tourism) చూపించనుంది. 

టూర్ తేదీలు

ఆగస్టు 1 నుండి 7 వరకు
ఆగస్టు 18 నుండి 24 వరకు
  సెప్టెంబర్ 1 నుండి 7 వరకు


ఐఆర్‌సీటీసీ ఎక్సో టిక్  టూర్ ప్రయాణం ఇలా..

1వ రోజు:  మొదటి రోజు తెల్లవారుజామున 5.10 గంటలకు హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్టులో ప్రయాణం ప్రారంభం అవుతుంది. మధ్యాహ్నం 12.30 గంటల‌కు ముంబై లేహ్ ఎయిర్‌పోర్టులో దిగుతారు. రాత్రికి లేహ్‌లోనే బస ఉంటుంది.

2వ రోజు:  ఉదయం అల్పాహారం చేసి.. లేహ్ నుంచి షామ్ వ్యాలీకి ( 75 కి.మీ.. 2 గంటలు వన్ వే)  బయలుదేరుతారు. శ్రీనగర్ హైవేలో సైట్ సీయింగ్ ఉంటుంది. అనంత‌రం హాల్ ఆఫ్ ఫేమ్, కాలీ మందిర్, గురుద్వార, శాంతి స్థూపం, లేహ్ ప్యాలెస్‌ల‌ను సందర్శిస్తారు. 

3వ రోజు:  బ్రేక్ ఫాస్ట్ చేసి.. నుబ్రా వ్యాలీ సందర్శన ఉంటుంది. లంచ్ తర్వాత దిక్షిత్, హండర్ విలేజ్‌ల‌ను చూడొచ్చు. సొంత ఖర్చులతో క్యామెల్ సఫారీ ఎంజాయ్ చేయొచ్చు. రాత్రికి నుబ్రా వ్యాలీలో బస చేయాలి.

4వ రోజు:  తుర్తుక్ గ్రామాన్ని (1971లో పాకిస్తాన్‌తో యుద్ధంలో భారత్ సాధించిన‌ గ్రామం ఇది) సందర్శిస్తారు. అనంత‌రం సియాచిన్ వార్ మెమొరియల్, థంగ్ జీరోపాయింట్ సందర్శించవచ్చు. తర్వాత బాల్టీ హెరిటేజ్ హౌజ్, మ్యూజియం, నేచురల్ కోల్డ్ స్టోరేజ్ చూడవ‌చ్చు. రాత్రికి నుబ్రా వ్యాలీలో బస ఉంటుంది

5వ రోజు:  ఐదో రోజు నుబ్రా వ్యాలీ నుంచి పాంగాంగ్ లేక్ సందర్శన ఉంటుంది. రాత్రి పాంగాంగ్‌లోనే బస చేస్తారు.

6వ రోజు: చాంగ్లా మీదుగా చేరుకొని పాంగాంగ్ లేక్‌లో సూర్యోదయాన్ని చూడొచ్చు. ఆ తర్వాత  ముంబై లేహ్ కు  బయలుదేరాలి. దారిలో థిక్సే మొనాస్టరీ, షే ప్యాలెస్ చూస్తారు. ముంబై లేహ్‌కు చేరుకున్న తర్వాత షాపింగ్ చేయడానికి సమయం ఉంటుంది. రాత్రికి  ముంబై లేహ్‌లో బస ఉంటుంది.

7వ రోజు: -ముంబై  లేహ్ నుంచి   తిరుగు ప్రయాణం ప్రారంభం అవుతుంది. మధ్యాహ్నం 1.40 గంటలకు లేహ్ ఎయిర్‌పోర్టులో బయలుదేరితే రాత్రి 9.40 గంటలకు హైదరాబాద్ చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది.

ఇక చార్జీల విషయానికి వస్తే...

 ప్యాకేజీలో ఒక్కరు ప్రయాణించాలనుకుంటే రూ.66,800  చెల్లించాల్సి ఉంటుంది. ఇద్దరు వ్యక్తులు కలిసి ప్రయాణిస్తే ఒక్కొక్కరు రూ.61,900, ముగ్గురు వ్యక్తులు కలిసి ప్రయాణిస్తే రూ.61,300  చెల్లించాల్సి ఉంటుందని ఐఆర్‌సీటీసీ తెలిపింది. అలాగే 5 నుంచి 11 సంవత్సరాల పిల్లలకు రూ. 60,000... అదే పిల్లలకు బెడ్ అవసరం లేదనుకుంటే రూ. 55,500  చెల్లించాలి. ఈ టూర్ ప్యాకేజీలో ఫ్లైట్ టికెట్లు, హోటల్‌లో బస, బ్రేక్‌ఫాస్ట్, డిన్నర్, ఏసీ బస్సులో సైట్ సీయింగ్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కవర్ అవుతాయి.