ఒమిక్రాన్​ ఇమ్యూనిటీతో ‘డెల్టా’కు చెక్​.

ఒమిక్రాన్​ ఇమ్యూనిటీతో ‘డెల్టా’కు చెక్​.
  •     అన్ని వేరియంట్ల నుంచి రక్షణ: ఐసీఎంఆర్​ స్టడీ 
  •     రీ ఇన్​ఫెక్షన్​ ముప్పు తక్కువే
  •     దేశంలో మరో 2,85,914 మందికి కరోనా​

న్యూఢిల్లీ: సెకండ్​వేవ్​లో ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా ‘డెల్టా’ను కొత్తగా వచ్చిన ఒమిక్రాన్​ చావుదెబ్బ కొట్టేస్తోంది. ఒమిక్రాన్​ ఇన్​ఫెక్షన్​ వల్ల వచ్చే ఇమ్యూనిటీ.. డెల్టా వేరియంట్​ను అణచేస్తోందని ఇండియన్​ కౌన్సిల్​ ఫర్​ మెడికల్​ రీసెర్చ్​(ఐసీఎంఆర్​) చేసిన స్టడీలో వెల్లడైంది. డెల్టాతో పాటు ఒమిక్రాన్​, ఇతర వేరియంట్లనూ ఆ ఇమ్యూనిటీ అడ్డుకుంటోందని తేలింది. ఒమిక్రాన్​ వచ్చిపోయినోళ్లకు డెల్టాతో పాటు ఇతర వేరియంట్లు మళ్లీ సోకే ముప్పు చాలా తక్కువని స్టడీ నిర్ధారించింది. ఇకపై ఒమిక్రాన్​ స్పెసిఫిక్​ వ్యాక్సిన్​ స్ట్రాటజీని అమలు చేయాల్సిన అవసరం ఉందని సూచించింది. ఇటీవల కొంతమంది ఒమిక్రాన్​ పేషెంట్లపై ఐసీఎంఆర్​ ఈ స్టడీ చేసింది. వాళ్లలో ఐజీజీ యాంటీ బాడీలు, న్యూట్రలైజింగ్​ యాంటీబాడీల పనితీరును ఐసీఎంఆర్​ సైంటిస్టులు పరిశీలించారు. అయితే, ఈ స్టడీకి సంబంధించి లిమిటేషన్స్​ కూడా ఉన్నాయని సైంటిస్టులు చెప్తున్నారు.  

యాక్టివ్​ కేసులు తగ్గినయ్​
దేశంలో కరోనా కేసులు 4 కోట్ల మార్కును దాటేశా యి. మంగళవారం మరో 2,85,914 మంది కరోనా బారిన పడగా.. మొత్తం కేసుల సంఖ్య 4 కోట్ల 85 వేల 116కు చేరింది. మరో 665 మంది కరోనాకు బలైపోగా మొత్తం మరణాలు 4,91,127కు పెరిగాయి. యాక్టివ్​ కేసులు 13,824 తగ్గడంతో..  ఇప్పుడు దేశంలో 22,23,018 కరోనా పేషెంట్లున్నారు.

ఇండియాకు సపోర్ట్​.. యూఎన్​
ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్​ డ్రైవ్​ను చేపట్టిన ఇండియాకు అన్ని విధాలా సాయం చేస్తున్నామని ఐక్యరాజ్యసమితి(యూఎన్​) వెల్లడించింది. ఇప్పటికే ఇండియాలో 60 కోట్ల మందికి తమ ప్రతిని ధులు కరోనా నివారణ మెసేజ్​లను ఇచ్చారని యూఎన్​ సెక్రటరీ జనరల్​  అధికార ప్రతినిధి స్టెఫానీ డుజారిక్​ చెప్పారు. షోంబీ షార్బ్​ నేతృత్వంలోని టీం.. ఇండియాలో కరోనా కేసుల నివారణ కోసం అధికారులకు సహకరిస్తున్నారని చెప్పారు.