భారతదేశ స్వాతంత్ర్యోద్యమంలో కార్మికవర్గం కీలకమైనది. అంతకుముందుగా కార్మికులు తమ డిమాండ్స్ పరిష్కారం కోసం పోరాటం చేయడం జరిగింది. భారతదేశంలో కార్మిక సంఘాల ఐక్యత పోరాటంతో 1926లో ఉమ్మడి కార్మిక సంఘం ఏర్పాటైంది. మే 1970లో సిఐటియు ఐక్యత పోరాటంతో ఏర్పడి నేడు దేశంలో నిరంతరం కార్మిక సమస్యలపైన, కార్మిక వ్యతిరేక ఆర్థిక విధానాలపై పోరాడుతోంది. మన ముందు తరాలవారు అనేక త్యాగాలు చేసి రక్తం చిందించిన ఫలితంగా కార్మికులకు హక్కులు లభించాయి ఈ హక్కులను కాపాడేందుకు కార్మికులు, ఉద్యోగులంతా ఐక్యంగా పోరాడాలి.
నిరంకుశంగా లేబర్ కోడ్స్ను ఆమోదించింది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం. ప్రజలంతా కరోనా కష్టకాలంలో ఉన్న సమయంలో బీజేపీ సర్కార్ ఈ విద్రోహ చర్యకు పాల్పడింది. వేతనాల కోడ్ ను 2019లో పార్లమెంట్లో ఆమోదించుకుంది. మిగతా మూడు కోడ్స్.. పారిశ్రామిక విధానం కోడ్, సామాజిక పద్ధతి కోడ్, విధి నిర్వహణ భద్రత ఆరోగ్యం పని పరిస్థితుల కోడ్లను 2020 సెప్టెంబర్‌లో ఎటువంటి చర్యలకు అవకాశం ఇవ్వకుండా నిరంకుశంగా ముందుకు తెచ్చింది. కార్మికులు చట్టాలు, హక్కులు పాలకులు ఎప్పుడూ కార్మికులకు ఫ్రీగా ఇవ్వలేదు. పోరాడి సాధించుకున్నవి కార్మిక హక్కులు. 1886 నాటి చికాగోలో కార్మికుల పోరాటం ఫలితమే నేటి మేడే. కార్మిక చట్టాలు పరిధి పెంచడం వలన 70 శాతం సంస్థలు 74% కార్మికులకు రక్షణ లేకుండా పోయింది.
ట్రేడ్ యూనియన్లపై ప్రభావం
నూతన కోడ్స్ వల్ల ట్రేడ్ యూనియన్లపై ప్రభావం పడుతున్నది. ఈ కోడ్స్ ప్రకారం సంస్థలో 10 శాతం మందిగాని, 100 మందిగాని ఏది తక్కువ అయితే అంతమంది వర్కర్స్ సభ్యులుగా ఉంటే రిజిస్ట్రేషన్ జరుగుతుంది. సెక్షన్ 6(4) ప్రకారం ఒక ట్రేడ్ యూనియన్‌లో ఆ సంస్థలో ఉన్న మొత్తం కార్మికుల్లో 10 శాతం కానీ లేదా 100 తక్కువ ఉన్నా కూడా ఆ యూనియన్ రిజిస్ట్రేషన్ కొనసాగుతుంది. యూనియన్ నాయకత్వాన్ని ఎన్నుకునేందుకు కార్మికులకుగల స్వేచ్ఛపై ఆంక్షలు విధిస్తుంది. ఈ కోడ్ లో 23(1)&2 కార్మికులు తమ నాయకత్వాన్ని ప్రజాస్వామ్యయుతంగా ఎన్నుకోవడానికి పరిమితులు విధించింది.
ఆఫీస్ బేరర్లో మూడో వంతు లేక బయట వ్యక్తులు ఐదుగురు ఏది తక్కువ అయితే దాని ప్రకారం మాత్రమే ఆఫీస్ బేరర్లు ఉండవచ్చని షరతులు విధించింది. ఆ సంస్థలో పనిచేస్తున్న కార్మికులే ఆఫీస్ బేరర్లుగా ఉంటే బెదిరించడం, వారు చేయని నేరానికి బాధ్యత చేయడం జరుగుతుంది. ఒక సంస్థలో ఒకటి కన్నా ఎక్కువ యూనియన్లు ఉంటే 51% పైగా కార్మికుల మద్దతు ఉన్న యూనియన్నే గుర్తింపు యూనియన్‌గా ఉంటుందని షరతు పెట్టారు. 51 శాతం ఎలా నిర్ధారిస్తారనేదానికి ఈ కోడ్‌లో ప్రస్తావన లేదు.
కార్మికులు మౌనంగా ఉంటే హక్కులకు సంకెళ్లే
ఈ కోడ్ కార్మికులను సమ్మె చేయడం సాధ్యం కాకుండా చేస్తుంది. ఇప్పుడు పారిశ్రామిక వివాదాల చట్టం ప్రకారం పబ్లిక్ సర్వీసులో మాత్రమే సమ్మె ప్రారంభానికి 15 రోజుల ముందు నోటీసులు ఇవ్వాలి. ఇతర రంగాల్లో ముందుగా నోటీస్ ఇవ్వకుండానే సమ్మెలో ప్రారంభించవచ్చు.
అందుకు భిన్నంగా ఈ పారిశ్రామిక వివాదాల కోడ్ సెక్షన్ 62(1) a &(b) ప్రకారం ఏ సంస్థలోనైనా సరే సమ్మెకు ముందుగా 60 రోజుల్లో సమ్మె చేయకూడదంటూ సమ్మె హక్కులను సమ్మె హక్కులను కాలరాస్తున్నారు. మరొక వైపు యజమాని కంపెనీలు లే ఆఫ్, అవుట్లకు కార్మిక శాఖ, ప్రభుత్వ అనుమతి అవసరం లేదని లేఔట్ విధించడానికి యజమానులకు ఈ కోడ్‌లో చట్టబద్ధంగా స్వేచ్ఛ కల్పించారు.
ఐఎల్సీ సమావేశాలు ముందుగా నిర్వహించాలి
ఈ మధ్యకాలంలో నవంబర్ 13న కేంద్ర కార్మిక సంఘం నాయకులతో లేబర్ మినిస్టర్ ని కలవడం జరిగింది. లేబర్ కోడ్స్ అమలు చేసే కన్నా ముందుగా లేబర్ కాంగ్రెస్ మీటింగ్‌ను నిర్వహించాలి. కానీ 2015 నుంచి ఇప్పటివరకు నిర్వహించలేదు. మనకు సుప్రీంకోర్టు ఏ విధంగా సుప్రీమో అలాగే కార్మికులకు కూడా ఐఎల్‌సి కమిటీ సమావేశం కూడా సుప్రీమే.
ప్రపంచ దేశాలకు మన లేబర్ మినిస్టర్, కేంద్ర ప్రభుత్వం కార్మికుల హక్కులను తాకట్టు పెట్టడం జరిగింది. నూతన కార్మిక చట్టాలు కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా ఉన్నాయి. వాటిని అమలు చేయడం లేదు అని వాళ్ళు స్పష్టంగా చెప్పడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ నిర్ణయాన్ని కార్మిక సంఘం నాయకులతో చర్చించి లేబర్ కోడ్స్ ఇక్కడ కూడా అమలు చేయకుండా చూడాలి.
ఆర్. అరవింద్
