పాక్‌‌‌‌ ప్రధానిని ఆడుకుంటున్న నెటిజన్లు

పాక్‌‌‌‌ ప్రధానిని ఆడుకుంటున్న నెటిజన్లు
  • చెట్లు ఆక్సిజన్‌‌‌‌ రాత్రి ఇస్తయట

పాకిస్తాన్‌‌‌‌ ప్రధానులు తెలివికి కేరాఫ్‌‌‌‌ అడ్రస్‌‌‌‌. తెలివంటే ఇంకేదో ఆలోచించేరు. అస్సలు కాదు. కొన్నిసార్లు వాళ్లేదో సీరియస్‌‌‌‌గా చెబుతుంటారు. కానీ అది కాస్త ‘అటూ ఇటై’ పెద్ద జోకైపోద్ది. ఈసారికి ఆ దేశ ప్రధాని ఇమ్రాన్‌‌‌‌ ఖాన్‌‌‌‌ వంతొచ్చింది. విచిత్రమైన కామెంట్‌‌‌‌ చేసి నవ్వులపాలయ్యారు. చెట్లు రాత్రిళ్లు ఆక్సిజన్‌‌‌‌ విడుదల చేస్తాయని చెప్పి ‘ఔరా!’ అనిపించారు. స్కాలర్‌‌‌‌షిప్‌‌‌‌ డ్రైవ్‌‌‌‌కు సంబంధించి ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఇమ్రాన్‌‌.. గత 10 ఏళ్లలో దాదాపు 70 శాతం చెట్లను నరికివేశారంటూ ప్రసంగం స్టార్ట్‌‌‌‌ చేశారు. దీని వల్ల ప్రజలు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. చెట్లు స్వచ్ఛమైన గాలినిస్తాయని, రాత్రిళ్లు ఆక్సిజన్‌‌‌‌ను విడుదల చేస్తాయని చెప్పారు. ఈ కామెంట్‌‌‌‌ను ఆ దేశ జర్నలిస్టు నైలా ఇనాయత్‌‌‌‌ ట్విట్టర్‌‌‌‌లో పోస్టు చేశారు. ఐన్‌‌‌‌స్టీన్‌‌‌‌ ఇమ్రాన్‌‌‌‌ ఖాన్‌‌‌‌ అని ఫన్నీ టైటిల్‌‌‌‌ కూడా ఇచ్చారు. దెబ్బకు వైరలైపోయింది వీడియో. నెటిజన్లు ఇమ్రాన్‌‌‌‌ను తెగ ఆడేసుకుంటున్నారు. ‘చెట్లు రాత్రిపూట కూడా ఫొటోసింథసిస్‌‌‌‌ జరుపుతాయని తెలియనే తెలియదు. ఖాన్‌‌‌‌కు నోబెల్‌‌‌‌ ప్రైజ్‌‌‌‌ ఇవ్వాల్సిందే’ అని ఒకరు కామెంట్‌‌‌‌ చేశారు. ఇంకొకరైతే ‘పాక్‌‌‌‌ ప్రధానిని తక్కువగా అంచనా వేయకుండి. ఆయన చెప్పారంటే రాత్రిళ్లు చెట్లు ఆక్సిజన్‌‌‌‌ విడుదల చేస్తాయంతే’ అని కామెంట్‌‌‌‌ పెట్టారు.