
హైదరాబాద్, వెలుగు: వీధి కుక్కల దాడిలో ఆరేండ్ల బాలిక చనిపోయింది. చెంగిచెర్ల సుశీల టౌన్ షిన్‌లో ఉంటున్న అమృత కవిత, వలీ కూతురు బేబీ(6). శనివారం ఇంటి బయట ఆడుకుంటున్న బేబీపై 5 కుక్కలు దాడి చేసి, తీవ్రంగా కరిచాయి. పాప కేకలతో బయటకి వచ్చిన తల్లిదండ్రులు కుక్కలను తరిమి బేబీని స్థానిక హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. అటునుంచి అంకుర హాస్పిటల్‌కు, కండీషన్ సీరియస్‌గా ఉండడంతో యశోదకు, అక్కడి నుంచి నిలోఫర్‌కు తరలించారు. ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన కొద్దిసేపటికే బాలిక చనిపోయింది. వీధి కుక్కల సమస్య తీవ్రంగా ఉందని పలుమార్లు కంప్లయింట్ చేసినా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు పట్టించుకోలేదని స్థానికులు మండిపడుతున్నారు.