కస్తూరిబా పాఠశాలలో ఫుడ్ పాయిజన్.. 100 మందికి అస్వస్థత

కస్తూరిబా పాఠశాలలో ఫుడ్ పాయిజన్.. 100 మందికి అస్వస్థత

నిజామాబాద్ జిల్లా భీంగల్ కస్తూరిబా పాఠశాలలో ఫుడ్ పాయిజన్ తో విద్యార్థినీలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. సుమారు 102 మంది స్టూడెంట్స్ కు పుడ్ పాయిజన్ అయ్యింది. సోమవారం (సెప్టెంబర్ 11న) రాత్రి హుటాహుటిన చికిత్స కోసం80 మంది విద్యార్థినీలను నిజామాబాద్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. 15 మందికి ఐసీయూలో, మిగితా వీరికి ఎమర్జెన్సీ వార్డులో చికిత్స అందిస్తున్నారు డాక్టర్లు.

ALSO READ:శక్తి స్కీమ్ రద్దు చేయాలె.. కర్నాటక సర్కారుకు ప్రైవేట్ ఆపరేటర్ల డిమాండ్​

భీంగల్ కస్తూర్భా పాఠశాలలో ఫుడ్ పాయిజన్ ఘటనలో బాధితుల సంఖ్య పెరుగుతోంది. వీరికి చికిత్స కొనసాగుతుండగానే మరో 30 మంది విద్యార్థినీలు అనారోగ్యం పాలయ్యారు. అంబులెన్స్ లో వారిని కూడా నిజమాబాద్ కు తలించారు. గంట గంటకు బాధితుల సంఖ్య పెరుగుతుండడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. కడుపు నొప్పి, వాంతులు, విరేచనలతో తీవ్ర అస్వస్థతకు గురవుతున్నారు విద్యార్థినీలు.