
దీపావళి పండుగ రోజు అందరూ కొత్త బట్టలు వేసుకోవాలని అనుకున్నాడు ఓ బట్టల వ్యాపారి. ఎక్కువ డబ్బులు పెట్టి కొనుగోలు చేయలేని వారికి అందుబాటులో ఉండేలా బట్టలను అమ్మాలని నిర్నయించాడు. అంతే ఓ బంపర్ ఆఫర్ ప్రకటించాడు. కేవలం రూపాయి చెల్లించి షర్ట్…10 రూపాయలతో నైటీని కొనుగోలు చేయండి అంటూ ప్రచారం చేశాడు. దీంతో కొత్త బట్టలు కొనేందుకు ఆ షాపు ముందు బారులు తీరారు జనం. దీనికోసం ప్రత్యేక టైంను నిర్ణయించారు.
చెన్నైలోని చాకలిపేటలోని ఓ బట్టల షాపు యజమాని భారీ ఆఫర్ ను ప్రకటించారు. రూపాయికి షర్ట్ తో పాటు… రూ.10 నైటీలను అమ్మారు. మొదట్లో 50 మందికి మాత్రమే టోకెన్లు ఇచ్చారు. అయితే జనం ఎక్కువ సంఖ్యలో రావడంతో 2వందల మందికి ఈ ఆఫర్ అమలు చేశారు. ఈ నెల 19 నుంచి 26వ తేదీ వరకు రోజూ ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు మాత్రమే ఈ ఆఫర్ పెట్టారు.
పేద ప్రజలు కూడా ఖరీదైన బట్టలు వేసుకుని దీపావళి పండుగ జరుపుకోవాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ షాపు యజమాని తెలిపారు.