పాపకు జన్మనిచ్చిన ట్రాన్స్ జెండర్ మగాడు

పాపకు జన్మనిచ్చిన ట్రాన్స్ జెండర్ మగాడు

లింగమార్పిడి చేసుకున్న  వారు.. వారి  క‌ల‌ల‌ను సాకారం చేసుకున్నారు.   ట్రాన్స్ జండర్ ( మగవ్యక్తి) ప్రసవించాడు.   ప్రపంచంలోనే తొలిసారిగా ఇంగ్లండ్ లో లింగమార్పిడి చేసుకున్న వ్యక్తి ఆడపిల్లకు జన్మనిచ్చాడు.  అంతకు ముందు 77 లక్షలతో ట్రీట్‌మెంట్ చేయించుకోవాలని భావించారు. వారు  తల్లిదండ్రులు కావడానికి వారికి స్పెర్మ్ డోనర్ అవసరమని వైద్యులు సూచించారు.

ఇంగ్లండ్‌లో  ఓ సంచలన ఘటన చోటు చేసుకుంది.  లింగమార్పిడి ( ట్రాన్స్ జండర్) చేసుకున్న వ్యక్తి (మగవ్యక్తి )ఆడబిడ్డకు జన్మనిచ్చాడు. కాలేబ్ బోల్డెన్ (27) అతని భార్య నియామ్ బోల్డెన్ (25) అనే ట్రాన్స్ జండర్లు  పేరెంట్స్ అయ్యారు.    నియామ్ కు మూడు సార్లు అబార్షన్లు అయ్యాయి.  ఆరోగ్య సమస్యల కారణంగా ఆమె ప్రసవించలేకపోయిందని వైద్యులు తెలిపారు.  

తల్లిదండ్రులు కావాలనే కోరికతో 27 నెలలు కాలేబ్  హార్మోన్ చికిత్సలు చేయించుకున్నాడు. కొంతకాలం మందులు వాడిన తరువాత  కాలేబ్ లో గర్భాశయం వృద్ది చెందడం   ప్రారంభమైంది. అయినా వారు  సాంప్రదాయ లింగ నిబంధనలకు కట్టుబడి ఉన్నారు. కాలేబ్ 2023 మేలో వెస్ట్ సఫోల్క్ హాస్పిటల్‌లో ఆడబిడ్డకు జన్మనిచ్చింది.  అయితే కాలేబ్ ఈ విషయాన్ని చాలా సీక్రెట్ గా ఉంచింది. అందుకే  అతనికి ఒక ప్రైవేట్ గది కేటాయించారు.  నియామ్ అనేక ఇబ్బందులను  ఎదుర్కొన్న తర్వాత వచ్చిన ఆనందంతో చాలా  థ్రిల్‌గా ఉన్నారు.