
తండ్రి మరణం త ట్టు కోలేక కూతురు గోదావరి నదిలో దూకింది . గోదావరిఖని గంగానగర్ గోదావరి బ్రిడ్జి వద్ద మంగళవారం ఈ ఘటన జరిగింది . మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని ఆదర్శనగర్ కు చెంది న ఆరవెల్లి వసంతం(70) కొద్ది రోజులుగా అనారోగ్యం తో బాధపడుతు న్నాడు . సోమవారం ఉదయం కుమారుడు వెం కటసాయితో బైక్ పై మంచిర్యాల హాస్పిటల్ కు వెళ్తుం డగా బర్రెను ఢీకొన్నారు. ప్రమాదంలో వసంతంకు తీవ్రగాయాలయ్యాయి. వెం కటసాయి స్వల్పం గా గాయపడ్డాడు . వసంతం పరిస్థితి సీరియస్ గా ఉండడంతో కుటుంబీలకు కరీంనగర్ హాస్పిటల్ కు తీసుకెళ్లారు. చికిత్స పొం దుతూ వసం తం మంగళ వారం మృతిచెం దాడు.మృతదేహాన్ని అంబులెన్స్ లో ఉంచి వెనక కారులో కుటుంబీకులు చెన్నూర్ కు బయలుదేరారు. గోదావరిఖని బ్రిడ్జి వద్దకు రాగానే వసంతం చిన్నకూతురు సాయిప్రియ(29) వాంతు లు వస్తున్నాయనడంతో కారు ఆపారు. కారు నుం చి దిగి న ఆమె క్షణాల్లోనే బ్రిడ్జి పైనుం చి గోదావరిలో దూకింది . మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది . సమాచారం అందుకున్న గోదావరిఖని టూటౌన్ పోలీసులు గజ ఈతగాళ్లను రప్పిం చి గాలిం పు చేపట్టారు. సుందిళ్ల బ్యారేజీ బ్యాక్ వాటర్ తో గోదావరిలో నిండు గా నీళ్లున్నాయి. సాయంత్రం చీకటిపడే వరకూ సాయిప్రియ ఆచూకీ దొరకలేదు.
చిన్నకూతురు.. ఆశ్రమ స్కూల్ లో టీచర్
ఆరవెల్లి వసంతం స్వస్థలం కాళేశ్వరం. ఇరవై ఏళ్ల క్రితం కుటుంబంతో పాటు చెన్నూర్ కు వచ్చి స్థా నిక ఆదర్శనగర్ లో నివాసం ఉంటున్నారు. వీరికి ఏడుగు రు కూతుళ్లు, ఇద్దరు కొడుకులు. సాయిప్రియ చిన్నమ్మాయి. సాయిప్రియతో పాటు నలుగురు అక్కలు ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నారు. సాయిప్రియ మంచిర్యాల జిల్లా కోటపల్లి ఎస్సీ ఆశ్రమ స్కూల్ లో టీచర్ గా చేస్తోంది . చిన్నకూతురు, ఒక కుమారుడు మినహా అందరికి వివాహాలు అయ్యాయి.