Drunk and Drive:తాగి పోలీసులను తిప్పల పెట్టిండు

Drunk and Drive:తాగి పోలీసులను తిప్పల పెట్టిండు

హనుమకొండలో మద్యం మత్తులో ఓ యువకుడు రోడ్డుపై వీరంగం సృష్టించాడు. కాకతీయ యూనివర్శిటీ చౌరస్తాలో మద్యం మత్తులో హల్ చల్ చేశాడు. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తున్న  ట్రాఫిక్ పోలీసులతో దురుసుగా ప్రవర్తించాడు. పోలీసులతో వాగ్వివాదానికి దిగాడు. ఎంత నచ్చజెప్పినా వినిపించుకోకపోవడంతో చివరకు నిందితుడి టూ వీలర్ ను సీజ్ చేశారు. కాకతీయ యూనివర్శిటీ పోలీసు స్టేషన్ లో కేసు నమోదు చేశారు.